HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya To Miss Odi Series India Vs Sri Lanka Due To Reason

India vs Sri Lanka: బీసీసీఐని విశ్రాంతి కోరిన మ‌రో సినీయ‌ర్ ఆటగాడు.. ఎవ‌రంటే..?

ప్రస్తుతం టీమిండియా శ్రీలంక (India vs Sri Lanka) పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.

  • Author : Gopichand Date : 16-07-2024 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

India vs Sri Lanka: ప్రస్తుతం టీమిండియా శ్రీలంక (India vs Sri Lanka) పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సిరీస్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ పర్యటనలో ODI, T20 సిరీస్‌లలో ఇద్దరు కొత్త కెప్టెన్‌లను చూసే అవ‌కాశం ఉంది. దీంతో పాటు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ టూర్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఈ పర్యటన నుండి టీమిండియాకు చెందిన మరో మ్యాచ్ విన్నింగ్ ఆటగాడు విశ్రాంతి కోరినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇది జరిగితే కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ టెన్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కోరాడు

ఓ వైపు శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోకూడదని కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోరుతున్నాడు. మరోవైపు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటానని మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ తెలిపాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇస్తూ వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి తనకు విశ్రాంతి అవసరమని చెప్పాడట‌. నిజానికి T20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో వారికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.

Also Read: MS Dhoni Invests: మ‌రో వ్యాపార రంగంలోకి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ..!

అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డే, టెస్టు క్రికెట్‌లో కొనసాగుతారు. విరాట్‌, రోహిత్‌ల‌కు శ్రీలంక పర్యటన నుండి విశ్రాంతి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. నివేదికల ప్రకారం.. శ్రీలంకతో జరిగే టి20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని చూడవచ్చు. అయితే ఇప్పుడు హార్దిక్ వన్డే సిరీస్‌లో ఆడటంపై సస్పెన్స్ కనిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

శ్రీలంక పర్యటనకు వెళ్ల‌నున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. వన్డే సిరీస్ ఆగస్టు 3 నుంచి ప్రారంభం కాగా.. చివరి మ్యాచ్ ఆగస్టు 7న జరగనుంది. నివేదికల ప్రకారం.. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఆడవలసిందిగా గౌతమ్ గంభీర్ అభ్యర్థించాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అన్ని వన్డే సిరీస్‌లు ఆడాలని గంభీర్ కోరుతున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gautham Gambhir
  • Hardik Pandya
  • ICC T20 World Cup 2024
  • Ind vs SL
  • india vs sri lanka
  • kohli

Related News

Hardik Pandya Dancing With GF Mahieka Sharma

మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా

Hardik Pandya  టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తాను ఇంకా కనీసం 10 ఏళ్లు భారత జట్టుకు ఆడాలని, ఈ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ సగమే పూర్తయ్యిందని, మిగిలిన కాలంలో కనీసం 10 ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని వెల్లడించాడు. ఈ విజయ

  • IND vs ENG

    టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..

  • Mohammad Amir

    టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd