IPL Final 2023: టైటిల్ కాపాడుకోవడంపై హార్దిక్…
ఐపీఎల్ 2023 ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్ ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అన్నీ దాటుకుని గుజరాత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 27-05-2023 - 9:09 IST
Published By : Hashtagu Telugu Desk
IPL Final 2023: ఐపీఎల్ 2023 ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్ ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అన్నీ దాటుకుని గుజరాత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. రేపు మే 28 ఆదివారం గుజరాత్, చెన్నై జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. గత సీజన్లో టైటిల్ ఎత్తుకెళ్ళిపోయిన హార్దిక్ సేన్ ఈ ఏడాది ఐపీఎల్ ట్రోపిని తన్నుకుపోవాలని చూస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్స్ కొట్టడం కొత్తేమీ కాదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ని హార్దిక్ పాండ్యా ఓడిస్తే హార్దిక్ ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో చేరిపోతాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్‌ను కాపాడుకోవడంలో సఫలమైన ఇద్దరు కెప్టెన్లు మాత్రమే ఉన్నారు. మొదటి కెప్టెన్ ధోనీ కాగా రోహిత్ శర్మ కూడా టైటిల్‌ను కాపాడుకున్నాడు.
2010లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. దీని తర్వాత మరుసటి సంవత్సరం 2011లో టైటిల్‌ను కాపాడుకోవడంలో కూడా విజయం సాధించింది. అదే సమయంలో రోహిత్ కెప్టెన్సీలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 2019 మరియు 2020 సంవత్సరాల్లో వరుసగా ఈ ఫీట్ చేసింది. ఇక 2023 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడంలో హార్దిక్ పాండ్యా విజయం సాధిస్తే గౌతమ్ గంభీర్ రికార్డును కూడా సమం చేస్తాడు. కెప్టెన్‌గా గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా మార్చాడు. హార్దిక్ గత సీజన్‌లో గుజరాత్‌తో టైటిల్‌ను గెలుచుకున్నాడు మరియు ఈ సీజన్‌లో కూడా అదే రాణించగలిగితే అతను గంభీర్ రికార్డుని సమం చేసినవాడవుతాడు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు మొత్తం నాలుగు సార్లు తలపడగా అందులో మూడుసార్లు హార్దిక్ పాండ్యా సేన విజయం సాధించింది. అదే సమయంలో IPL 2023 మొదటి క్వాలిఫయర్‌లో చెన్నై మొదటిసారి గుజరాత్‌ని ఓడించి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
Read More: Prithvi Shaw : ప్రియురాలితో పృథ్వీ షా హల్‌చల్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో..