Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు..!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు.
- By Gopichand Published Date - 09:51 AM, Tue - 7 March 23

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘనత సాధించాడు. హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, ఫెదరర్, డచ్ రేసింగ్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ తదితరుల కంటే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్న హార్దిక్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హార్దిక్ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్టు పెట్టాడు. మీ అభిమానానికి అభిమానులందరికీ ధన్యవాదాలు. నా అభిమానులందరూ నాకు ప్రత్యేకమైనవారు. సంవత్సరాలుగా వారు నాపై చూపిన ప్రేమ, మద్దతుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు.
2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి హార్దిక్ క్రికెటర్‌గా మంచి ఫామ్‌లో ఉన్నాడు. 29 ఏళ్ల వయస్సులో అతను భారత జట్టుతో పాటు ఐపిఎల్‌లో సీనియర్ సభ్యుడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో ఆడుతున్న భారత జట్టులో పాండ్యా భాగం కాదు. హార్దిక్ చేతిలో స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, ఆడియో, డెనిమ్స్, షర్టులు, బ్యాటరీలు, లూబ్రికెంట్లు, ఎనర్జీ డ్రింక్, బిస్కట్‌లు, క్యాజువల్ దుస్తులు, షూస్, బెవరేజ్, పెర్ఫ్యూమ్, మీడియా అండ్ బ్రాడ్‌కాస్ట్ వంటి రంగాల్లో 20కి పైగా బ్రాండ్‌లు ఉన్నాయి.
Also Read: Steve Smith: కమిన్స్ దూరం.. 4వ టెస్టుకు కూడా స్మితే కెప్టెన్.. !
2016లో హార్ధిక్ పాండ్యా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2018 నుంచి టెస్టుల్లో ఆడలేదు. వెన్నునొప్పి నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన తరువాత కీలక సభ్యుడిగా ఎదిగాడు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీ తన జట్టు గుజరాత్ జెయింట్స్‌కు అందించిన పాండ్యా.. పొట్టి ప్రపంచ కప్ తరువాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న మరోమారు పెళ్లాడి వార్తల్లోకి నిలిచిన విషయం తెలిసిందే.

Tags
- Hardik Instagram Followers
- Hardik Pandya
- Insta Followers
- Pandya Instagram Followers
- team india

Related News

IPL 2023: ఐపీఎల్ తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేయగల ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 (IPL 2023)లో తొలి మ్యాచ్ చెన్నై, గుజరాత్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ సహా ఐదుగురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయగలరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.