Gujarat Giants: ఢిల్లీకి షాక్ ఇచ్చిన గుజరాత్.. 11 పరుగుల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఢిల్లీ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- Author : Gopichand
Date : 17-03-2023 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఢిల్లీ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎల్ వోల్వార్డ్ 57 పరుగులు, ఆష్లే గార్డనర్ అజేయంగా 51 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ జట్టు 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది.
ఈ విజయంతో గుజరాత్ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు, నాలుగు ఓటములతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఢిల్లీ జట్టుకు కావాల్సింది ఒక్క విజయం. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాలుగు విజయాలు, రెండు ఓటములతో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
Also Read: IND vs AUS ODI Series 2023: నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే.. మొదటి మ్యాచ్ కు రోహిత్ దూరం..!
ఒక దశలో ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 135 పరుగులు చేసింది. ఆ తర్వాత 13 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు క్రీజులో అరుంధతి రెడ్డి, శిఖా పాండే ఉండగా వీరిద్దరి మధ్య 35 పరుగుల భాగస్వామ్యం ఉంది. దీని తర్వాత కిమ్ గార్త్.. అరుంధతి రెడ్డిని అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పింది. 17 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి అవుట్ అయింది. ఆ తర్వాత ఓవర్‌లో గార్డనర్ పూనమ్ యాదవ్ (0)ని అవుట్ చేసి గుజరాత్‌కు విజయాన్ని అందించింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది.