IND vs SL: హార్దిక్ పాండ్యాతో స్పిన్ వేయించనున్న గంభీర్?
టీమిండియా శ్రీలంక తొలి టి20 మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గంభీర్ స్ట్రాటజీ చూసి జనాలు పిచ్చోళ్ళయిపోయారు. విషయం ఏంటంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని స్పిన్ బౌలర్ గా మార్చేందుకు గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పాండ్య లెగ్ స్పిన్ బౌలర్‌గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది.పేసర్ గా పేరున్న హార్దిక్ తొలిసారి స్పిన్ బౌలింగ్ చేశాడు.
- By Praveen Aluthuru Published Date - 04:52 PM, Sat - 27 July 24

IND vs SL: విదీశీ గడ్డపై టీమిండియా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. కరేబియన్ గడ్డపై ఇటీవల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత్ ఈ రోజు శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు సిద్దమవుతుంది. పల్లెకల్లె వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు నిన్న శుక్రవారం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి.
టీమ్ ఇండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి సిరీస్ కావడంతో లంక పర్యటనను వీరిద్దరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కాంబోలో తొలి ప్రయత్నం కచ్చితంగా విజయవంతం చేయాలనీ గంభీర్ కసిగా ఉన్నట్టు అర్ధమవుతుంది. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో గంభీర్ స్ట్రాటజీ చూసి జనాలు పిచ్చోళ్ళయిపోయారు. విషయం ఏంటంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని స్పిన్ బౌలర్ గా మార్చేందుకు గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పాండ్య లెగ్ స్పిన్ బౌలర్‌గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది.పేసర్ గా పేరున్న హార్దిక్ తొలిసారి స్పిన్ బౌలింగ్ చేశాడు.
పాండ్య లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు గంభీర్ వ్యూహంలో ఇదొక ప్రయత్నమని అంటుంటే మరికొందరి పాండ్య స్పిన్ బౌలింగ్ పై మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి శ్రీలంక పిచ్‌లు స్పిన్ బౌలింగ్ కు సహకరిస్థాయి. ఈ నేపథ్యంలో గంభీర్ పాండ్యాను స్పిన్నర్‌గా మార్చేసి ఉండొచ్చు. ఇదిలా ఉంటే.. లంక పర్యటనలో హార్దిక్ పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. వ్యక్తిగత కారణాలతో పాండ్య వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. టి20 సిరీస్ కు సూర్య కెప్టెన్ కాగా వన్డేలకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Also Read: Paris Olympics : ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఓటమి