Gautam Angry Celebration: లక్నో డగౌట్ లో గంభీర్ ఎమోషనల్
ఐపీఎల్ 2022 సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగినమ్యాచ్‌లో లక్నోజట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఫాన్స్ ను ఉత్కంఠతో ఊపేసింది.
- By Naresh Kumar Published Date - 12:14 PM, Thu - 19 May 22

ఐపీఎల్ 2022 సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగినమ్యాచ్‌లో లక్నోజట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఫాన్స్ ను ఉత్కంఠతో ఊపేసింది.
చివరి ఓవర్‌లో కోల్ కతా విజయం కోసం 21 పరుగులు అవసరమవగా.. రింకు సింగ్ వరుసగా 4, 6, 6, 2 కొట్టేశాడు. దాంతో కేకేఆర్ ఆఖరికి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. .ఈ క్రమంలో డగౌట్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ చాలా టెన్షన్ పడుతూ కనిపించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మార్కస్ స్టాయినిస్ వేసే ముందు గంభీర్ కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు.
ఆఖరికి లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడంతో డగౌట్‌లో గట్టిగా అరుస్తూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక గంభీర్ సారధ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 2012, 2014 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్.. కేకేఆర్ తో మ్యాచ్ తర్వాత మాత్రం చాలా ఎమోషనల్ గా కనిపించాడు. ఇదిలా ఉంటే ఇరు జట్లకీ ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడిన లక్నో సూపర్ జెయింట్స్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఓపెనర్లు క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం కోల్ కతా పోరాడినా 208 పరుగులే చేయగలిగింది.
What a great match ❤️
Always loving your agression Mr.Gambhir😍 #gautamgambhir #KKRvsLSG pic.twitter.com/Tt4mWFedWj— Gautian Harshit (@GautianHarshit) May 18, 2022