HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Fitness Is Importantravi Shastri On Hardik Pandyas Captaincy Snub

Hardik Pandya: ప్రమాదంలో హార్దిక్ వన్డే కెరీర్, ఆ ఒక్కటి చేయాల్సిందే

వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హార్దిక్ 10 లేదా 8 ఓవర్లు వేయగలను అని అతను అనుకుంటాడో అప్పుడే తాను వన్డేకి సెలెక్ట్ అవుతాడు అంటూ రవిశాస్త్రి తన మనసులో భావాలను వ్యక్తపరిచాడు.

  • Author : Praveen Aluthuru Date : 30-07-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా ఏళ్ల నుంచి ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. బౌలింగ్ విషయంలో పాండ్యా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఈ సమస్య వన్డే ఫార్మెట్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే హార్దిక్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అందుకే హార్దిక్ ఎర్లీ ఏజ్ లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఒక టి20 , ఒక వన్డే సిరీస్ ఆడుతుంది. టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తవ్వగా రెండిట్లోనే టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది.

టి20 భవిష్యతు కెప్టెన్ హార్దిక్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ తెరపైకి వచ్చాడు. కాగా ఫిట్​నెస్ ఇష్యూస్ కారణంగానే హార్దిక్​కు బదులు సూర్యకుమార్​కు టీ20 పగ్గాలు అప్పజెప్పారు. అంతేకాదు హార్దిక్ ని లంకతో జరిగే వన్డే సిరీస్​కు కూడా ఎంపిక చేయలేదు.దీంతో హార్దిక్ వన్డే ఫార్మేట్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు. వన్డే టీమ్​లో ఉండాలంటే హార్దిక్ పాండ్యా ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకోక తప్పదని, కనీసం 8 ఓవర్లు వేయాల్సిందేనని స్పష్టం చేశాడు. దీనికి ముందు అతను సాధ్యమైనన్ని ఎక్కువ టి20 మ్యాచ్​లు ఆడాలి. తాను ఫిట్​గా ఉన్నానని అతడు భావిస్తే వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.

వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హార్దిక్ 10 లేదా 8 ఓవర్లు వేయగలను అని అతను అనుకుంటాడో అప్పుడే తాను వన్డేకి సెలెక్ట్ అవుతాడు అంటూ శాస్త్రి తన మనసులో భావాలను వ్యక్తపరిచాడు. ఇకపోతే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టి20లో హార్దిక్ ఫర్వాలేదనిపించాడు. మొదటి టీ20లో అంతగా రాణించకపోయినా.. రెండో మ్యాచ్​లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 31 పరుగులు చేశాడు.

Also Read: Milk from Neem Tree : వేప చెట్టు నుండి పాలు..ఇది దేవుడి మాయే అంటున్న భక్తులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bowling
  • Captaincy Snub
  • fitness
  • Hardik Pandya
  • ODI Career
  • Ravi Shastri
  • T20s

Related News

Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

Hardik Pandya  టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్ కోసం కొలంబోలో అడుగుపెట్టిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య హోటల్‌ లాబీలో తన గర్ల్‌ప్రెండ్ మహిక శర్మతో కనిపించాడు. తద్వారా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీలులేదు. కానీ పాండ్యా గర్ల్‌ప్రెండ్‌త

  • Longest Sixes

    టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 భారీ సిక్సర్లు.. లిస్టులో హార్దిక్, దూబే.. నంబర్-1 ఎవరో తెలుసా?

  • T20 World Cup 2026

    న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Latest News

  • పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సూపర్ 8కు టీమిండియా!

  • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

  • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd