టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!
2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా టీ-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టైటిల్‌ను నిలబెట్టుకోవాల్సిన భారీ బాధ్యత ప్రస్తుత కెప్టెన్ సూర్య (సూర్యకుమార్ యాదవ్) పై ఉంది.
- Author : Gopichand
Date : 28-01-2026 - 5:44 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup 2026: టీ-20 వరల్డ్ కప్ 2026 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈసారి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవాలనే (డిఫెండ్) పట్టుదలతో బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి టీమ్ ఇండియాకు విజయం అంత సులభం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెమీఫైనల్ చేరే అవకాశం ఉన్న నాలుగు జట్ల పేర్లను వెల్లడించారు.
పఠాన్ అంచనా
స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్ టీ-20 వరల్డ్ కప్ 2026 గురించి కీలక అంచనా వేశారు. ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లే నాలుగు జట్లు భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ
2024లో టీ-20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుండి భారత జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరోవైపు ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా ఎప్పుడూ శక్తివంతమైన ప్రదర్శన ఇస్తుంది. అలాగే ఇంగ్లాండ్ జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు.
టైటిల్‌ను కాపాడుకునే దిశగా టీమ్ ఇండియా
2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా టీ-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టైటిల్‌ను నిలబెట్టుకోవాల్సిన భారీ బాధ్యత ప్రస్తుత కెప్టెన్ సూర్య (సూర్యకుమార్ యాదవ్) పై ఉంది. టీ-20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరుసగా రెండోసారి టైటిల్‌ను గెలవలేదు (డిఫెండ్ చేయలేదు).
అంతేకాకుండా ఏ జట్టు కూడా తన సొంత గడ్డపై టీ-20 వరల్డ్ కప్ గెలవలేదు. అయినప్పటికీ భారత జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, సూర్య, హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టిస్తుండగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి జట్టుకు ట్రంప్ కార్డులుగా మారే అవకాశం ఉంది.