Test Retirement: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. రీఎంట్రీకి కారణమిదే..?
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ (Test Retirement) నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.
- Author : Gopichand
Date : 08-06-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
Test Retirement: ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ (Test Retirement) నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌కు ECB.. అలీని ఎంపిక చేసింది.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీస్‌లతో మాట్లాడిన తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. మొయిన్ అలీ 2021లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టీ20ల్లో ఆడుతూనే ఉన్నా.. ఇప్పుడు యాషెస్ సిరీస్‌కు ముందే పునరాగమనం చేశాడు. స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో మొయిన్ అలీని జట్టులోకి తీసుకున్నారు.
Also Read: WTC Final 2023: హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ… తొలిరోజు ఆసీస్ దే
జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం
ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ వెన్నులో ఒత్తిళ్ల కారణంగా యాషెస్‌కు దూరమయ్యాడు. లీచ్ స్థానంలో యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీని ఇంగ్లండ్ జట్టులోకి తీసుకున్నారు. యాషెస్ సిరీస్ జూన్ 16న ప్రారంభమై జూలై 31 వరకు జరగనుంది.
మొయిన్ అలీ టెస్ట్ కెరీర్
మొయిన్ అలీ 2014లో ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. దీని తర్వాత అతను తన చివరి టెస్టును సెప్టెంబర్ 2021లో భారత్‌తో ఆడాడు. అతను ఇంగ్లండ్ తరపున మొత్తం 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2914 పరుగులు చేశాడు. టెస్టుల్లో 195 వికెట్లు తీశాడు.
యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (C), జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఒల్లీ పాప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టాంగ్, క్రిస్ వోక్స్, మార్క్ .