WTC Final 2023: హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ… తొలిరోజు ఆసీస్ దే
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం కనబరిస్తే... మిగిలిన రెండు సెషన్లలో ఆసీస్ దే పై చేయిగా నిలిచింది
- By Praveen Aluthuru Published Date - 10:45 PM, Wed - 7 June 23

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం కనబరిస్తే… మిగిలిన రెండు సెషన్లలో ఆసీస్ దే పై చేయిగా నిలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ నిర్ణయం సరైనదే అనిపించేట్టు మన బౌలర్లు అదరగొట్టారు. నలుగులు పేసర్లు ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో తొలి సెషన్ వరకూ సక్సెస్ అయ్యారు. వార్నర్ , ఖవాజా, లబూషేన్ లను త్వరగానే ఔట్ చేసి శుభారంభం ఇచ్చారు. అయితే రెండో సెషన్ నుంచి సీన్ రివర్స్ అయింది. హెడ్ కౌంటర్ ఎటాక్ బ్యాటింగ్ తో భారత్ కు షాక్ తగిలింది. స్మిత్ సపోర్ట్ తో అదరగొట్టిన హెడ్ వన్డే తరహా బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. వేగంగా పరుగులు చేస్తూ భారత్ ను ఒత్తిడిలో పడేశాడు. అటు ఆచితూచి ఆడిన స్మిత్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో కోలుకున్న ఆస్ట్రేలియా చివరి సెషన్ లో దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో హెడ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 251 పరుగులు జోడించారు.
చివరి సెషన్ లో స్మిత్ కూడా సెంచరీ పూర్తి చేసుకోవడంతో తొలిరోజు కంగారూలదే పైచేయిగా నిలిచింది. ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 327 పరుగులు చేసింది. హెడ్ 146 , స్మిత్ 95 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత ఈ మ్యాచ్ కు నలుగులు పేసర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగింది. అశ్విన్ స్థానంలో ఉమేశ్ యాదవ్ ను తీసుకోగా.. అతను పెద్దగా రాణించలేదు. ఈ నిర్ణయం ప్రభావం చూపించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారీస్కోర్ దిశగా సాగుతున్న ఆసీస్ ను రెండోరోజు ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే అంత మంచిది. లేకుంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం కష్టంగానే కనిపిస్తోంది.
Read More: Yuvagalam Padayatra : డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీడీపీ యువగళం జెండాలు..