KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) ప్రారంభానికి ముందే జట్లకు పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలా జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోతున్నాయి.
- By Gopichand Published Date - 09:31 AM, Sat - 22 March 25

KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) ప్రారంభానికి ముందే జట్లకు పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలా జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోతున్నాయి. ఇతర కారణాల వల్ల ఆ ఆటగాళ్లు కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు దూరం అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) పేరు కూడా చేరబోతోంది. రాహుల్ ఢిల్లీ జట్టు మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మార్చి 24.. మార్చి 30న జరిగే ఢిల్లీ రెండు ఓపెనింగ్ మ్యాచ్‌లకు రాహుల్ గైర్హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఢిల్లీకి చాలా కష్టమేనని, దీనికి మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ ముఖ్యమని భావిస్తున్నారు.
ఢిల్లీ తొలి రెండు మ్యాచ్‌లు ఈ జట్లతోనే జరగనున్నాయి
ఢిల్లీ క్యాపిటల్స్ తన కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సమక్షంలో మార్చి 24న IPL 2025లో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఢిల్లీ తొలి మ్యాచ్ మార్చి 24న కేఎల్ రాహుల్ పాత జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనుండగా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మార్చి 30న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.
ఈ మహిళా క్రికెటర్ రాహుల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు
తొలి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ దూరానికి కారణాన్ని మీడియా కథనం పేర్కొంది. ఈ కారణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ లేదా ఏ క్రీడాకారిణి చెప్పలేదు. అయితే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలిస్సా హీలీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌ను పంచుకుంటున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అలిస్సా హీలీ. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన పోడ్‌కాస్ట్‌లో జట్టు వ్యూహాన్ని అలిస్సా హీలీ చర్చించారు. అందులో రాహుల్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కావొచ్చని పేర్కొంది.
Also Read: George Foreman: విషాదం.. ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత!
రాహుల్ గైర్హాజరీకి ఇదే కారణం కావచ్చు
పోడ్‌కాస్ట్ సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా హీలీ, టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఢిల్లీకి KL రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. దీనికి కారణం చెబుతూ.. తనకు (రాహుల్) బిడ్డ పుట్టబోతుందన్నాడు. రాహుల్- అతని భార్య అతియా శెట్టి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌తో కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో ఆమె తన బేబీ బంప్‌ను చూపించింది.