Dhoni : వామ్మో.. ధోనీ రోజుకు 5 లీటర్ల పాలు తాగుతారా? నిజమేనా..?
Dhoni : రోజుకు ఐదు లీటర్ల పాలు తాగడమన్నది అసలు నిజం కాదని స్పష్టం చేశారు.
- Author : Sudheer
Date : 22-04-2025 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni ) తన శక్తి, ఫిట్‌నెస్‌కు కారణం రోజుకు 5 లీటర్ల పాలు (drinking five liters of milk)తాగడమేనన్న వదంతులు ఓ సమయంలో తెగ వైరల్ అయ్యాయి. ధోనీ బలంగా ఉండటం వల్లే అభిమానులు అటువంటి ఊహాగానాలు నిజమే అని అనుకున్నారు. అయితే ఇప్పుడు స్వయంగా ధోనీనే ఈ విషయంపై స్పందించారు. రోజుకు ఐదు లీటర్ల పాలు తాగడమన్నది అసలు నిజం కాదని స్పష్టం చేశారు.
TDP Leader Murder : టీడీపీ నేత, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి దారుణ హత్య..!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధోనీ.. “అత్యధికంగా తాగేది ఓ లీటర్ పాలు కావొచ్చు. దానికంటే ఎక్కువ తాగడం కష్టమే. నాది అంత పెద్ద అరటి చెట్టు కాదు కదా!” అంటూ నవ్వుతూ చెప్పారు. తనకు సాధారణ ఆహారపు అలవాట్లు ఉన్నాయని, అలా ఎవరికైనా చెప్పడమంటే కాస్త అతిశయోక్తిగా ఉందని ధోనీ వెల్లడించారు.
ఇక మరో పాపులర్ రూమర్ అయిన వాషింగ్ మెషిన్లో లస్సీ తయారు చేసుకుంటారన్న వాదనపైనా ధోనీ స్పందించారు. “వాషింగ్ మెషీన్లో లస్సీ తయారుచేస్తానన్నది పూర్తిగా అవాస్తవం. నిజం చెప్పాలంటే, నాకే లస్సీ తాగే అలవాటు లేదు” అని ధోనీ చెప్పారు. తనపై ఉన్న పలు రూమర్లను తేలికగా, హాస్యంతో ఖండించిన ధోనీ స్టైల్‌కు అభిమానులు మరోసారి ఫిదా అయ్యారు.