Dinesh Karthik: ఆర్సీబీ జట్టులోకి దినేష్ కార్తీక్
భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ మరియు మెంటార్‌గా నియమించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొద్దీ సేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
- Author : Praveen Aluthuru
Date : 01-07-2024 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
Dinesh Karthik: భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ మరియు మెంటార్‌గా నియమించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొద్దీ సేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దినేష్ కార్తీక్‌కు టీమ్ మెంటార్, బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించినట్లు ఆర్సీబీ తెలిపింది. కార్తీక్ కొత్త అవతార్‌తో తిరిగి వస్తున్నాడని పోస్టులో పేర్కొంది.
దినేష్ కార్తీక్ గత ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పుడు కార్తీక్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో పాటు ఇతర జట్లకు కార్తీక్ ఆడాడు. కాగా ఆర్సీబీ టైటిల్ కలగానే మిగిలిపోతుంది. గత సీజన్లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. అయితే ఆ తర్వాత అద్భుతంగా పునరాగమనం చేశారు. లీగ్ దశలోని చివరి మ్యాచ్‌లో చెన్నైని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆర్సీబీ కప్ కొట్టాలన్న కల కలగానే మిగిలింది.
దినేష్ కార్తీక్ 2008లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తం 257 మ్యాచ్‌ల్లో 4842 పరుగులు చేశాడు. అతని సగటు 26. అందులో 22 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 97 పరుగులు.కాగా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన దినేష్ కార్తీక్ ఇప్పుడు కామెంట్రీతో అలరిస్తున్నాడు. ఇటీవల ముగిసిన టి20ప్రపంచ కప్ లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో భాగమయ్యాడు.
Also Read: Weight Loss: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయాన్నే ఇలా చేయాల్సిందే?