Dhruv Jurel: అరుదైన ఘనత సాధించిన ధృవ్ జురెల్.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు..!
రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ.. 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయానికి హీరో 23 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ (Dhruv Jurel).
- Author : Gopichand
Date : 27-02-2024 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
Dhruv Jurel: రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ.. 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయానికి హీరో 23 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ (Dhruv Jurel). అతను మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. గత 22 ఏళ్లలో ఏ భారత వికెట్ కీపర్ చేయలేని ఫీట్‌ను సాధించాడు.
ధృవ్ జురెల్ తన తొలి సిరీస్‌లోనే చరిత్ర సృష్టించాడు
ఈ మ్యాచ్‌లో ధృవ్ జురెల్ టీమ్ ఇండియాకు ట్రబుల్ షూటర్ అని నిరూపించాడు. రాంచీ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ 90 పరుగులతో పటిష్ట ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా 39 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ధృవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. విశేషమేమిటంటే గత 22 ఏళ్లలో ఓ భారత వికెట్ కీపర్ తన అరంగేట్రం సిరీస్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ధృవ్ కంటే ముందు అజయ్ రాత్ర 2002 సంవత్సరంలో భారతదేశం కోసం ఈ ఫీట్ చేశాడు.
Also Read: First Class Admission : ఆ ఏజ్ నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్.. రాష్ట్రాలకు కేంద్రం లెటర్
ఈ విషయంలో ధృవ్ జురెల్ నంబర్-1 అయ్యాడు
ధృవ్ జురెల్ టీమ్ ఇండియా తరఫున ఇప్పటి వరకు కేవలం 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడి అభిమానుల్లో స్టార్‌గా మారిపోయాడు. అతి తక్కువ టెస్టు మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న భారత వికెట్ కీపర్‌గా ధృవ్ జురెల్ నిలిచాడు. తన కెరీర్‌లో రెండో టెస్టులో మాత్రమే అతను ఈ అవార్డును గెలుచుకున్నాడు. గతంలో ఈ రికార్డు అజయ్ రాత్ర పేరిట ఉండేది. అజయ్ రాత్ర తన కెరీర్‌లో మూడో టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
తక్కువ టెస్టు మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన కీపర్లు
2వ టెస్ట్ మ్యాచ్ – ధృవ్ జురెల్
3వ టెస్ట్ మ్యాచ్ – అజయ్ రాత్ర
14వ టెస్ట్ మ్యాచ్ – నయన్ మోంగియా
16వ టెస్ట్ మ్యాచ్ – రిషబ్ పంత్
16వ టెస్ట్ మ్యాచ్ – వృద్ధిమాన్ సాహా
31వ టెస్ట్ మ్యాచ్ – MS ధోని
We’re now on WhatsApp : Click to Join