టీ20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌కు ఈ ఆటగాళ్లు ఎందుకు దూరమయ్యారు?
సంజూ శాంసన్ జట్టులో లేకపోవడానికి ప్రధాన కారణం అతని పేలవ ఫామ్. న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్‌కు ప్రతి మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది.
- Author : Gopichand
Date : 07-02-2026 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
India vs USA Match: 2026 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్- యూఎస్ఏ (USA) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే భారత తుది జట్టు ప్రకటన తర్వాత అందులో పలువురు కీలక ఆటగాళ్ల పేర్లు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
జస్ప్రీత్ బుమ్రా ఎందుకు ఆడటం లేదు?
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు ప్రధాన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బుమ్రా ఆరోగ్యం ప్రస్తుతం బాగులేదని తెలిపాడు. నివేదికల ప్రకారం అతనికి జ్వరం రావడంతో యూఎస్ఏతో జరిగే మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో కేవలం 24 గంటల ముందే సిరాజ్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చేరడం గమనార్హం.
Also Read: పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?
సంజూ శాంసన్ ఎందుకు దూరమయ్యాడు?
సంజూ శాంసన్ జట్టులో లేకపోవడానికి ప్రధాన కారణం అతని పేలవ ఫామ్. న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్‌కు ప్రతి మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. కానీ ఆ సిరీస్ మొత్తం కలిపి అతను కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుండి మంచి లయలో ఉన్నాడు. అందుకే అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు దిగాడు.
వాషింగ్టన్ సుందర్ అన్‌ఫిట్
వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతనికి ‘సైడ్ స్ట్రెయిన్’ సమస్య ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. మైదానంలోకి దిగడానికి అతనికి ఇంకా అనుమతి లభించలేదు.