MS Dhoni Retirement: ధోనీ ఖచ్చితంగా ఐపీఎల్ 2024లో ఆడతాడు
ఐపీఎల్ 2023లో అందరి చూపు ధోని వైపే. ఈ సీజన్లో ధోని క్రేజ్ మాములుగా లేదు. తన చివరి ఐపీఎల్ ఇదేనంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతున్నారు
- Author : Praveen Aluthuru
Date : 24-05-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni Retirement: ఐపీఎల్ 2023లో అందరి చూపు ధోని పైనే. ఈ సీజన్లో ధోని క్రేజ్ మాములుగా లేదు. తన చివరి ఐపీఎల్ ఇదేనంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతున్నారు. మాహీ బ్యాటింగ్ చూడటానికి అభిమానులు తహతహలాడుతున్నారు. ఇక చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ధోనీ సేన ఘన విజయం సాధించిన తర్వాత ధోని తన రిటైర్మెంట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది ఎం చిదంబరానికి తిరిగి రావడం గురించి హర్షా భోగ్లే అడిగినప్పుడు మాహీ క్లారిటీ ఇవ్వకపోగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. “నాకు తెలియదు. దానిపై నిర్ణయం తీసుకోవడానికి నాకు 8 నుండి 9 నెలల సమయం ఉంది. నాకిప్పుడు ఆ తలనొప్పి అవసరం లేదని, అయితే నేను ఆడినా ఆడకపోయినా బయటి నుండి అయినా చెన్నై జట్టు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని అన్నారు.
ధోని రిటైర్మెంట్ పై చెన్నై మాజీ ఆటగాడు, ధోని స్నేహితుడు డ్వేన్ బ్రావో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మొదటి క్వాలిఫయర్‌లో గుజరాత్‌పై విజయం సాధించిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రావో వచ్చే ఏడాది మాహీ ఆడతాడా ప్రశ్నపై బ్రావో ఇలా అన్నాడు “100 శాతం ధోని వచ్చే ఐపీఎల్ ఆడతాడు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ కెప్టెన్సీ కారణంగా అతనిని సిఎస్కె వచ్చే ఐపీఎల్ లోనూ ఆడిస్తుంది అంటూ ధోని ఫ్యాన్స్ కి ఒక చల్లటి వార్త చెప్పాడు.
తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు సత్తా చాటారు. సీఎస్‌కే నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టాటిన్స్ 157 పరుగులకు ఆలౌటైంది. జట్టులో శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో సీఎస్‌కే తరఫున రవీంద్ర జడేజా, మహేశ్ తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా, చివరి ఓవర్లలో మతిషా పతిరనా కూడా విధ్వంసం సృష్టించారు.
Read More: CSK Vs GT Qualifier 1: ధోనీతో అట్లుంటది.. జియో సినిమా రికార్డ్ వ్యూస్