HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Csks Maiden Win Over Dc Gaikwad Fined For Slow Over Rate

CSKకు తొలి విజయం.. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఫైన్‌!

ఐపీఎల్ 2026లో తొలి విజయం తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేస్తూ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ 200-210 పరుగులు చేయడం శుభపరిణామమని అన్నాడు.

  • Author : Gopi Date : 12-04-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaikwad Fined
Gaikwad Fined

Gaikwad Fined: శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2026లో సిఎస్‌కేకు ఇదే తొలి విజయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 56 బంతుల్లో నాటౌట్‌గా 115 పరుగులు చేయగా, అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఆయుష్ మ్హత్రే 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

స్లో ఓవర్ రేట్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్‌పై జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్‌లో జట్టు చేసిన మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్‌పైనే 12 లక్షల రూపాయల జరిమానా పడింది.

Also Read: ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది?

రుతురాజ్ గైక్వాడ్‌పై జరిమానా

ఐపీఎల్ తన స్టేట్‌మెంట్‌లో ఇలా పేర్కొంది. ఐపీఎల్ 2026లోని 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆడుతున్నప్పుడు కనీస ఓవర్ రేట్ పాటించనందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా విధించడమైనది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది ఈ సీజన్‌లో ఆ జట్టు చేసిన మొదటి తప్పు కాబట్టి గైక్వాడ్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించడమైనది అని ప్ర‌క‌ట‌నలో రాసుకొచ్చింది.

బౌలర్లకు క్రెడిట్ ఇచ్చిన గైక్వాడ్

ఐపీఎల్ 2026లో తొలి విజయం తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేస్తూ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ 200-210 పరుగులు చేయడం శుభపరిణామమని అన్నాడు. సంజూ శాంసన్, ఆయుష్ మ్హత్రే బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూనే ఈ రోజు బౌలర్లదేనని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో జేమీ ఓవర్టన్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ 5 ఓవర్లలో 61 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (18) వికెట్ పడటంతో అక్కడి నుండి వరుసగా వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఓడిపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings Victory
  • CSK
  • CSK vs DC
  • Gaikwad Fined
  • IPL 2026
  • Jamie Overton 4 Wickets
  • Ruturaj Gaikwad Fine
  • Sanju Samson Century
  • slow over rate

Related News

Mathisha Pathirana

KKR అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్ ఫిట్!

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 14న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఇప్పటివరకు కేకేఆర్ 4 మ్యాచ్‌లు ఆడగా, అందులో మూడింటిలో ఓడిపోయింది.

  • Vaibhav Suryavanshi

    వైభవ్ సూర్యవంశీకి నిజంగా 15 ఏళ్లేనా?

  • (rr) Team Manager Romi Bhin

    IPL రూల్ బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డ RR మేనేజర్

  • Sanju Samson

    ఐపీఎల్‌ 2026లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డు.. సీజన్‌లో తొలి సెంచరీ నమోదు!

  • MS Dhoni

    ఎంఎస్ ధోనీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌!

Latest News

  • మెర్సిడెస్ బెంజ్ షాక్.. భారత్‌లో ఒకేసారి 4 కార్ల మోడళ్లు నిలిపివేత!

  • 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 78 వేల సబ్సిడీ.. ఏంటి ఈ ప్రభుత్వ పథకం?

  • ఏప్రిల్‌లో ఫిబ్రవరి వంటి చలి ఇంకెన్నాళ్లు?

  • High Court : అమీన్‌పూర్‌ ఇండ్ల కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

  • ప్ర‌ముఖ గాయ‌ని క‌న్నుమూత‌!

Trending News

    • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

    • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd