MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడనున్నాడా? క్లారిటీ ఇదే!
కెప్టెన్‌గా ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ధోని నాయకత్వంలో సీఎస్కే తమ 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అతను వికెట్ల వెనుక గ్లవ్స్‌తో, లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో జట్టు కోసం అద్భుతంగా రాణించాడు.
- By Gopichand Published Date - 02:18 PM, Sat - 8 November 25
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) అభిమానుల కోసం ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఓ పెద్ద వార్త వెలువడింది. ధోని మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడనున్నాడు. ఇది ఖరారైంది. ధోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున పసుపు జెర్సీలో కనిపించనున్నాడు. ఐపీఎల్ 2026 మార్చిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐపీఎల్ మినీ-వేలం డిసెంబర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ధోని చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడతాడని అంచనా వేస్తున్నారు. ధోని వయసు ప్రస్తుతం 44 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతను ఐపీఎల్‌లో ఆడటం కొనసాగించాడు.
ఐపీఎల్ 2026లో ధోని ఆడతాడా?
మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని గత కొన్ని సీజన్ల నుంచి చర్చ జరుగుతోంది. అయినప్పటికీ ధోని ఇప్పటివరకు అన్ని సీజన్లలో ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోని ఆడటం గురించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. “ధోని రాబోయే ఐపీఎల్‌లో కూడా ఆడతాడు” అని తెలిపారు.
Also Read: Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు
దీంతో ధోని ఆడటం ఖాయమైంది. కానీ అతను మొత్తం టోర్నమెంట్ ఆడతాడా? లేదా చెన్నైలో జరిగే మ్యాచ్‌తోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అతను మొత్తం ఐపీఎల్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. కెప్టెన్‌గా జట్టుకు అనేక రికార్డులను సాధించాడు.
ధోని అద్భుతమైన ఐపీఎల్ కెరీర్
కెప్టెన్‌గా ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ధోని నాయకత్వంలో సీఎస్కే తమ 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అతను వికెట్ల వెనుక గ్లవ్స్‌తో, లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో జట్టు కోసం అద్భుతంగా రాణించాడు. ధోని ఇప్పటివరకు ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లు ఆడి, 24 అర్ధసెంచరీలతో సహా 5,439 పరుగులు చేశాడు.