HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Cristiano Ronaldo In Tears After Qatar World Cup

FIFA World Cup 2022: సెమీస్‌కు చేరిన మొరాకో.. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో

  • Author : Gopi Date : 11-12-2022 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ronaldo
Cropped

ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup 2022)లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. టోర్నమెంట్‌లోని మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 1–0తో మొరాకో ఓడించింది. ఈ జట్టు ఓటమితో క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచకప్‌ కల కూడా చెదిరిపోయింది. ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup 2022)లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో నిలిచింది. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

పోర్చుగల్‌ ఓటమి ఆ జట్టు వెటరన్‌ ప్లేయర్‌ క్రిస్టియానో ​​రొనాల్డోపై ప్రభావం చూపింది. మ్యాచ్‌లో ఓడిపోవడంతో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాడు. రెండో అర్ధభాగం ముగిసే సమయానికి రొనాల్డోకు గోల్ చేసే అవకాశం వచ్చింది. పోర్చుగల్ ఎదురుదాడికి దిగినా రొనాల్డో వేసిన కిక్ నేరుగా గోల్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 38 ఏళ్ల రొనాల్డోకు ఇది 5వ FIFA ప్రపంచకప్. ఒక్కసారి కూడా తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు.

Also Read: PT Usha: పీటీ ఉష సరికొత్త రికార్డు.. IOA తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక

సెకండాఫ్‌లో చివరి ఆరు నిమిషాల ఇంజూరీ టైమ్‌లో మొరాకో 10 మందితో ఆడవలసి వచ్చింది. కానీ ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.యూసఫ్ ఎన్ నెస్రీ హెడర్‌తో మొరాకో మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్ 42వ నిమిషంలో అతను గోల్ చేశాడు. చివరి నిమిషంలో 10 మందితో ఆడినప్పటికీ మొరాకో పోర్చుగల్‌ను నిలువరించింది. యూసుఫ్‌ కొట్టిన గోల్‌కు డగౌట్‌లో కూర్చున్న రొనాల్డో ఆశ్చర్యపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్‌ 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రొనాల్డో సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగాడు. బంతి దొరకడమే ఆలస్యం గోల్‌పోస్ట్‌ వైపు మెరుపు వేగంతో కదిలాడు. మ్యాచ్‌లో పోర్చుగల్‌ మూడు సార్లు మొరాకో గోల్‌పోస్ట్‌పై దాడి చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరకు మొరాకో విజయం సాధించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cristiano Ronaldo
  • FIFA world cup
  • Fifa world cup 2022
  • morocco
  • portugal football team
  • ronaldo in tears

Related News

Ronaldo's journey comes to an end!

FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజంగా పేరు పొందిన క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచులో పోర్చుగల్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2 దశాబ్ద

  • Messi's magnificent performance at the FIFA World Cup.

    FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం

Latest News

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd