అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!
ఆయుష్ మ్హాత్రే కెప్టెన్సీలో టీమ్ ఇండియా అండర్-19 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి ఛాంపియన్ పీఠాన్ని అధిరోహించింది.
- Author : Gopichand
Date : 06-02-2026 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
U19 World Cup 2026: అండర్-19 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులతో విస్ఫోటక ఇన్నింగ్స్ ఆడగా, బౌలింగ్‌లో ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్లు తీసి రాణించారు. భారత జట్టు ఈ ట్రోఫీని గెలవడం ఇది ఆరోసారి.
ఆరోసారి ఛాంపియన్‌గా టీమ్ ఇండియా
ఆయుష్ మ్హాత్రే కెప్టెన్సీలో టీమ్ ఇండియా అండర్-19 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి ఛాంపియన్ పీఠాన్ని అధిరోహించింది. ఇంగ్లాండ్ తరపున కెలెబ్ ఫాల్కనర్ చివరి వరకు ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.
Also Read: టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపట్నుంచి సందడే!
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
Congratulations to India U19 on winning the ICC Men's U19 World Cup 2026 👏👏
Their historic 6⃣th title 🫡
Take. A. Bow 🙇
Scorecard ▶️ https://t.co/hisult7mtv #U19WorldCup pic.twitter.com/5a0Pf4wpTw
— BCCI (@BCCI) February 6, 2026
ఫాల్కనర్ అద్భుత బ్యాటింగ్‌తో కేవలం 67 బంతుల్లోనే 115 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అలాగే బెన్ డాకిన్స్ 66 పరుగుల సహకారం అందించారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ 56 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు తీశారు.
వైభవ్ సూర్యవంశీ చారిత్రక ఇన్నింగ్స్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. జట్టులో వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్ ఆడుతూ 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తన తుఫాను ఇన్నింగ్స్‌లో వైభవ్ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. 218 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ 14 ఏళ్ల కుర్రాడు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఇతర ఆటగాళ్లలో కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే 51 బంతుల్లో 53 పరుగులు చేయగా, అభిజ్ఞాన్ కుందు 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.