ఐపీఎల్‌కు ముందు సూర్యవంశీ సంచలన ప్రకటన!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన ప్రకటన చేస్తూ తాను ఎవరి రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నాడో వెల్లడించాడు.
- Author : Gopichand
Date : 16-03-2026 - 2:19 IST
Published By : Hashtagu Telugu Desk
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన ప్రకటన చేస్తూ తాను ఎవరి రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నాడో వెల్లడించాడు. గత సీజన్ (2025 ఐపీఎల్)లో వైభవ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ఒక భారీ రికార్డును నెలకొల్పాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయ బ్యాటర్ అయ్యాడు.
అయితే 35 బంతుల్లో సెంచరీతో వైభవ్ సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు అతను క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డుపై కన్నేశాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఏడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్ 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డే లక్ష్యం
బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్’ కార్యక్రమంలో వైభవ్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీరు ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకుంటున్నారా? అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేయాలనుకుంటున్నారా? లేదా క్రిస్ గేల్ చేసిన 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నారా? దీనికి వైభవ్ ఏమాత్రం తడుముకోకుండా 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడమే నా లక్ష్యం అని సమాధానమిచ్చాడు.
గేల్ ఆ 175 పరుగులు ఎప్పుడు చేశాడు?
2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ పుణె వారియర్స్ మీద క్రిస్ గేల్ కేవలం 66 బంతుల్లోనే 175* పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. మరి ఈ రికార్డును వైభవ్ ఎప్పుడు బద్దలు కొడతాడో చూడాలి.
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కెరీర్
వైభవ్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. అతను ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 7 ఇన్నింగ్స్‌ల్లో 36 సగటుతో, 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 101 పరుగులు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ ఫ్రాంచైజీ అతడిని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. రాబోయే సీజన్లో వైభవ్ ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.