Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఛాంపియన్ ట్రోఫీ 2025.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు!
భారత క్రికెట్ జట్టు 2025 చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా 12 సంవత్సరాల పాత జ్ఞాపకాలను తాజా చేసింది. ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఈ టోర్నమెంట్‌లో అనేక కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.
- By Gopichand Published Date - 06:13 PM, Wed - 21 May 25

Champions Trophy 2025: భారత క్రికెట్ జట్టు 2025 చాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy 2025) గెలుచుకోవడం ద్వారా 12 సంవత్సరాల పాత జ్ఞాపకాలను తాజా చేసింది. ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఈ టోర్నమెంట్‌లో అనేక కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. పాత రికార్డులు బద్దలయ్యాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ టోర్నమెంట్‌లో ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. దీనిని ఐసీసీ చైర్మన్ జయ్ షా తాజాగా వెల్లడించారు. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని ఈవెంట్‌లలో అత్యధికంగా చూడబడిందని జయ్ షా తెలిపారు.
చాంపియన్స్ ట్రోఫీ 2025లో సృష్టించబడిన రికార్డు ఇదే
ఐసీసీ చైర్మన్ జయ్ షా తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా ఇలా వ్రాశారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ సీజన్ అత్యధికంగా చూడబడిన ఎడిషన్‌గా నిలిచిందని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్‌కు 368 బిలియన్ వీక్షణ నిమిషాలు లభించాయి. ఇది 2017తో పోలిస్తే 19 శాతం ఎక్కువ అని రాసుకొచ్చారు. జయ్ షా తన పోస్ట్‌లో మరొక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు 65.3 బిలియన్ వీక్షణ నిమిషాలు లభించాయని, ఇది 2017లో చూడబడిన ఫైనల్‌తో పోలిస్తే 52.1 శాతం ఎక్కువ అని తెలిపారు. 2017లో కూడా భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఆ టోర్నమెంట్‌ను గెలవలేకపోయింది. చాంపియన్స్ ట్రోఫీ 2017లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసింది.
Also Read: Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్
చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టంతో 251 పరుగులు చేసింది. భారత్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బదులుగా భారత జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టంతో 254 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్‌ను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు 12 సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు.