HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bowling Action Rules In Cricket

బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఒకవేళ యాక్షన్ 15 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఆ బౌలర్‌పై వెంటనే నిషేధం విధిస్తారు. అతను తన యాక్షన్‌ను సరిదిద్దుకుని, మళ్లీ టెస్టులో పాస్ అయితేనే అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి అనుమతిస్తారు.

  • Author : Gopichand Date : 11-02-2026 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bowling Action
Bowling Action

Bowling Action: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై క్రికెట్ వర్గాలు రెండుగా విడిపోయాయి. భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా దీనిపై ప్రశ్నలు గుప్పించగా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అసలు ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒక బౌలర్ యాక్షన్‌ను ఐసీసీ ఎలా పరీక్షిస్తుంది? అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఉస్మాన్ తారిక్ యాక్షన్‌లో వివాదం ఏమిటి?

ఉస్మాన్ తారిక్ బంతిని విడిచే ముందు కాసేపు ఆగి,ఆ తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ‘పాజ్’ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అశ్విన్ అభిప్రాయం ప్రకారం.. బంతి వేసే ముందు ఆగడం నిబంధనల ప్రకారం సరైనదే. కానీ బంతిని విసిరే క్రమంలో అతని చేయి వంగుతోందా లేదా అనేది ఐసీసీ తేల్చాల్సిన విషయం.

ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ బంతిని విసరకూడదు, కేవలం బౌలింగ్ మాత్రమే చేయాలి.

15 డిగ్రీల నియమం: బౌలర్ బంతిని విడిచే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా సాగదీస్తే లేదా వంచితే దానిని ‘ఇల్లీగల్ యాక్షన్’గా పరిగణిస్తారు. మానవ శరీర నిర్మాణం ప్రకారం బౌలింగ్ చేసేటప్పుడు చేయి స్వల్పంగా వంగడం సహజం కాబట్టి, ఐసీసీ ఈ 15 డిగ్రీల వరకు వెసులుబాటు కల్పించింది.

Also Read: ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

యాక్షన్‌ను ఐసీసీ ఎలా తనిఖీ చేస్తుంది?

ఒక బౌలర్ యాక్షన్‌పై అనుమానం వస్తే ఐసీసీ అనుసరించే ప్రక్రియ ఇలా ఉంటుంది.

ఫీల్డ్ రిపోర్ట్: మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్లు లేదా మ్యాచ్ అధికారులు బౌలర్ యాక్షన్ సరిగ్గా లేదని భావిస్తే, వారు మ్యాచ్ ముగిశాక ఒక నివేదికను సమర్పిస్తారు.

బయోమెకానిక్స్ టెస్టింగ్: రిపోర్ట్ అందిన తర్వాత సదరు బౌలర్ ఐసీసీ గుర్తింపు పొందిన ‘టెస్టింగ్ సెంటర్’కు వెళ్లాలి. అక్కడ అత్యాధునిక 3D సెన్సార్లు, హై-స్పీడ్ కెమెరాల సాయంతో బౌలింగ్ యాక్షన్‌ను రికార్డ్ చేస్తారు.

విశ్లేషణ: ల్యాబ్‌లో బౌలర్ తన సాధారణ వేగంతో బంతులు వేయాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ సాయంతో మోచేయి ఎన్ని డిగ్రీలు వంగుతుందో ఖచ్చితంగా లెక్కిస్తారు.

నిషేధం- పునరాగమనం: ఒకవేళ యాక్షన్ 15 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఆ బౌలర్‌పై వెంటనే నిషేధం విధిస్తారు. అతను తన యాక్షన్‌ను సరిదిద్దుకుని, మళ్లీ టెస్టులో పాస్ అయితేనే అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి అనుమతిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bowling action
  • Cricket World Cup
  • ICC rules
  • T20 World Cup 2026
  • Usman Tariq
  • Usman Tariq Bowling Action

Related News

Super Over

క్రికెట్ చరిత్రలో మొద‌టి సూపర్ ఓవర్ ఎప్పుడు జ‌రిగిందో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి తొలి సందర్భం 2024లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ టోర్నీలోనే మొదటి డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌ను ఆడాయి.

  • Quinton de Kock

    ధోనీ రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన డి కాక్‌!

  • IND vs PAK T20 World Cup 2026

    భారత్-పాక్ మ్యాచ్ కు భారీ క్రేజ్.. మరింతగా పెరిగిన కొలంబో విమాన టికెట్‌ ధరలు..

  • BCCI

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ కీల‌క నిబంధ‌న‌లు!

  • T20 World Cup 2026

    నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

Latest News

  • పతంజలి తేనెకు అంతర్జాతీయ ఆమోదం!

  • భోజనం చేసిన వెంటనే నీరు తాగడం సరైనదేనా?

  • ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్‌!

  • భారత్ ట్యాక్సీ అంటే ఏమిటి? ఇది ఎందుకు వార్తల్లో ఉంది?

  • ఉద‌యం మీరు కూడా ఇలాంటి త‌ప్పులు చేస్తున్నారా?

Trending News

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd