Gautam Gambhir : స్వదేశానికి గౌతం గంభీర్.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..
గౌతం గంభీర్(Gautam Gambhir) తిరిగి వచ్చే వరకు.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోచేట్, మోర్నే మోర్కెల్, టి.దిలీప్‌లు టీమిండియా ప్లేయర్లకు సలహా సంబంధిత సహకారాన్ని అందించనున్నారు.
- Author : Pasha
Date : 26-11-2024 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అకస్మాత్తుగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్‌కు తిరుగు పయనమయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఆయన ఇండియాకు బయలుదేరారు. వ్యక్తిగత కారణాలతోనే గంభీర్ భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 30 నుంచి ఆస్ట్రేలియాలోని కేన్‌బెరాలో జరగనున్న వార్మప్ మ్యాచ్‌కు ఆయన దూరం కానున్నారు. వచ్చే నెల (డిసెంబరు) 6న అడిలైడ్‌లో జరగనున్న రెండో టెస్టు కంటే ముందే ఆస్ట్రేలియాకు గౌతం గంభీర్ తిరిగి చేరుకుంటారని సమాచారం.
Also Read :Mumbai Terror Attack: 26/11 ఉగ్రదాడికి 16 ఏళ్లు.. ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే..
గౌతం గంభీర్(Gautam Gambhir) తిరిగి వచ్చే వరకు.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోచేట్, మోర్నే మోర్కెల్, టి.దిలీప్‌లు టీమిండియా ప్లేయర్లకు సలహా సంబంధిత సహకారాన్ని అందించనున్నారు. ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యారు. తన భార్య బిడ్డలను చూడాల్సి ఉండటంతో ఆయన మొదటి టెస్టును ఆడలేదు. ఇక రోహిత్ ఆస్ట్రేలియాకు తిరిగొచ్చారు. రెండో టెస్టులో ఆయన ఆడనున్నారు.
Also Read :Ram Gopal Varma : ఆర్జీవీకి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇప్పటికే పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది. రేపు టీమిండియా పెర్త్ నుంచి కేన్‌బెరాకు బయలుదేరుతుంది. ఈనెల 30 (శనివారం) నుంచి కేన్‌బెరాలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టుతో భారత టీమ్‌కు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టుకు జాక్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కంటే ముందే కేన్‌బెరాలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ భారత క్రికెట్ టీమ్ ప్లేయర్లకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ డే అండ్ నైట్ జరగనుంది. అందుకే ఆ మ్యాచ్ కన్నా ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ భారత ప్లేయర్లకు కీలకంగా మారనుంది. ఈ టెస్టులో పింక్ కలర్ కోకాబురా బంతిని వాడుతారు.