BCCI : పెద్ద పెద్ద స్టార్లకు బీసీసీఐ షాక్? వేలం నుంచి 1040 మంది ప్లేయర్లు ఔట్..!
- Author : Vamsi Chowdary Korata
Date : 09-12-2025 - 12:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2026 మినీ వేలంపై ఆసక్తికరమైన ట్విస్ట్‌లు! 1390 మందిలో కేవలం 350 మందికే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వింటన్ డి కాక్ వంటి సర్‌ప్రైజ్ ఎంట్రీలు, కొత్త విదేశీ, భారతీయ ఆటగాళ్ల జాబితా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో వేలం మొదలుకానుంది. ఆటగాళ్ల కేటగిరీల వారీగా వేలం ప్రక్రియ సాగనుంది. కొత్తగా లిస్టులో చేరిన విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశానికి చెందిన ప్లేయర్లే ఎక్కువ మంది ఉన్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలం దగ్గరపడుతున్న కొద్ది కొత్త కొత్త ట్విస్ట్‌లు వస్తున్నాయి. రిటెన్షన్, రిలీజ్ సమయంలో సంజు శాంసన్ – రవీంద్ర జడేజా, శామ్ కరన్ డీల్ ఐపీఎల్ బిగ్గెస్ట్ డీల్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక మరికొద్ది రోజుల్లో మినీ వేలం మొదలవుతుంది అనగా.. వేలానికి వచ్చి 1390 మంది ప్లేయర్లలో 1040 మందిని తొలగిస్తూ బీసీసీఐ షాక్ ఇచ్చింది. రిజెక్ట్ అయిన ప్లేయర్లలో పెద్ద పెద్ద ఆటగాళ్లు కూడా ఉండటం విశేషం. తుది జాబితాలో 35 మంది సర్‌ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం పంపిన తొలి లిస్టులో 1,390 ప్లేయర్లున్నారు. అయితే ఫ్రాంచైజీలతో జరిగిన పలుమార్లు చర్చలు, మార్పుల తర్వాత బీసీసీఐ చివరకు ఆ జాబితాను భారీగా తగ్గించి 350 పేర్లతో ఫైనల్ లిస్టు విడుదల చేసింది. అంటే దాదాపు 75 శాతం తగ్గింపు. మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి ఎతిహాద్ అరేనాలో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది.
350 మంది తుది జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన పేరు క్వింటన్ డి కాక్. తొలి జాబితో ఆయన పేరు లేకపోయినా, ఒక ఫ్రాంచైజీ నేరుగా అభ్యర్థించడంతో కీపర్-బాటర్‌ల మూడో లాట్‌లో డికాక్ పేరు చేర్చారు. ఇటీవల అంతర్జాతీయ రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చిన డి కాక్ విశాఖపట్నంలో సెంచరీ బాదడంతో మళ్లీ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈసారి డికాక్ బేస్ ప్రైస్ రూ.1 కోటి. గత మెగా వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఉన్న సంగతి తెలిసిందే.
ఈసారి లిస్టులోకి కొత్తగా చేరిన విదేశీ ప్లేయర్లు ఎవరంటే.. అరబ్ గుల్ (అఫ్ఘనిస్తాన్), మైల్స్ హామండ్ (ఇంగ్లండ్), డాన్ లాటేగన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎజ్‌థర్‌హుయ్జెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బాయండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), బినుర ఫెర్నాండో (శ్రీలంక), కుశాల్ పెరేరా (శ్రీలంక), దునిత్ వెల్లాలాగే (శ్రీలంక), ఆఖీమ్ అగస్టే (వెస్టిండీస్).
భారతీయ ప్లేయర్ల విభాగంలో కూడా అనేక ఆశ్చర్యకరమైన పేర్లు చేరాయి. సాదెక్ హుస్సెన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేశ్ శర్మ, కనిష్క్ చౌహన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యశ్‌రాజ్ పుంజా, సహిల్ పరాఖ్, రోషన్ వాఘ్‌సారే, యష్ దిచోల్కర్, అయాజ్ ఖాన్, ధుర్మిల్ మట్కర్, నమన్ పుష్పక్, పరిక్షిత్ వాల్సంగ్కర్, పురవ్ అగర్వాల్, రిషభ్ చౌహన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన షెకావత్.
మొదట క్యాప్డ్ ప్లేయర్లు- బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, కీపర్-బాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అనే కేటగిరీల్లో వేలం ప్రక్రియ జరుగుతుంది. తర్వాత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఇదే క్రమంలో బిడ్‌కు వస్తారు బ్యాటర్ మొదటి బ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, ఫ్రేజర్ మెక్ గర్క్, పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్ పేర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్లలో వెంకటేశ్ అయ్యర్ ఉన్నాడు. 70వ ప్లేయర్ తర్వాత వేలం వేగం పెరుగుతుంది. 71 నుంచి 350 వరకు ప్లేయర్లు మొదటి యాక్సిలరేటెడ్ లైన్‌లో ఉంటారు. అనంతరం అమ్ముడుపోని లేదా ఇంకా ప్రెజెంట్ చేయని పేర్లను ఫ్రాంచైజీలు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.