HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bcci Shake Up Binny Quits This Veteran Is Taking Over

BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా.. బాధ్యతలు చేపట్టిన రాజీవ్ శుక్లా!

బీసీసీఐ పరిపాలన లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. పార్లమెంటు ఆమోదించిన కొత్త క్రీడా చట్టం నోటిఫై అయ్యే వరకు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలు అదే రాజ్యాంగాన్ని పాటించాల్సి ఉంటుంది.

  • Author : Gopi Date : 29-08-2025 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India New Sponsor
Team India New Sponsor

BCCI: బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఒక మీడియా నివేదిక వెల్లడించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఓ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. బుధవారం బీసీసీఐ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజీవ్ శుక్లా అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ప్రధానంగా స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. డ్రీమ్11తో ఒప్పందం ముగియడం, తదుపరి రెండు లేదా రెండున్నర సంవత్సరాల కోసం కొత్త స్పాన్సర్‌ను వెతకడంపై చర్చలు జరిగాయి.

ఆ నివేదిక ప్రకారం.. ఆసియా కప్‌కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున అంత తక్కువ వ్యవధిలో కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం కష్టం. “ఇక రెండు వారాలు కూడా మిగిలి లేవు. మేము ప్రయత్నిస్తున్నాం. కానీ కొత్త టెండర్ జారీ చేయడం, చట్టపరమైన ప్రక్రియలను పాటించడం, మిగిలిన సాంకేతిక పనులకు సమయం పడుతుంది” అని ఒక అధికారి తెలిపారు. కేవలం ఆసియా కప్ కోసం తాత్కాలిక స్పాన్సర్‌ను తీసుకువస్తారా అన్న ప్రశ్నకుతాము అలా చేయబోమని, తమ ప్రధాన లక్ష్యం 2027 వన్డే ప్రపంచ కప్ వరకు స్పాన్సర్‌ను తీసుకురావడమని ఆ అధికారి పేర్కొన్నారు.

Also Read: Megastar Chiranjeevi: అభిమాని ప‌ట్ల అపార‌మైన ప్రేమ చూపిన మెగాస్టార్ చిరంజీవి!

కొత్త ఎన్నికలు అనివార్యం

రాజీవ్ శుక్లా కొత్త బీసీసీఐ అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు తాత్కాలిక నాయకుడిగా కొనసాగుతారు. దేశంలో జాతీయ క్రీడా పరిపాలన చట్టం వచ్చినా ఇంకా దాని నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీనికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. అందువల్ల బీసీసీఐ తమ ఎన్నికలను వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది.

ప్రస్తుతానికి.. బీసీసీఐ పరిపాలన లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. పార్లమెంటు ఆమోదించిన కొత్త క్రీడా చట్టం నోటిఫై అయ్యే వరకు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలు అదే రాజ్యాంగాన్ని పాటించాల్సి ఉంటుంది. దాని ప్రకారం.. 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఏ అధికారీ పదవిలో కొనసాగడానికి వీలు లేదు. కొత్త చట్టం నోటిఫై అయితే ఈ వయసు పరిమితి ఉండదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup 2025
  • BCCI
  • Binny
  • indian cricket team
  • Rajiv Shukla
  • sports news

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

  • Who is Team India's new T20 captain?

    T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd