HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bcci Selectors To Soon Announce India Squad For T20 Wc

India Squad: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 27 లేదా 28వ తేదీన‌ బీసీసీఐ స‌మావేశం..!

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో జరగనుంది. మే 1లోగా అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది.

  • Author : Gopichand Date : 21-04-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Squad
India Victory

India Squad: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో జరగనుంది. మే 1లోగా అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితిలో అందరి చూపు ప్రపంచ నంబర్-1 T20 జట్టు టీమిండియా (India Squad) ఏ ఆట‌గాళ్ల‌తో ప్రపంచ కప్‌లో బ‌రిలోకి దిగుతుందా అనే దానిపైనే ఉంది. BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ త్వరలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడానికి సమావేశం నిర్వహించబోతున్నారని, ఆ తర్వాత ప్రపంచ కప్‌కు భారత జట్టును ప్రకటిస్తారని మీడియా నివేదిక‌ల్లో వైర‌ల్ అవుతోంది.

ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన స‌మావేశం

ఓ వార్త సంస్థ నివేదిక‌ ప్రకారం సెలెక్టర్లందరూ ఏప్రిల్ 27 లేదా 28న ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించవచ్చు. ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుందని, అందువల్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఢిల్లీలో ఉంటాడు. నివేదిక ప్రకారం T20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టు ఎంపికను రోహిత్ శర్మ, అందరు సెలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం స్పెయిన్‌లో సెలవులో ఉన్నారు. ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన ఢిల్లీకి వచ్చి నేరుగా సమావేశంలో పాల్గొంటారు.

Also Read: Chinese swimmers: డోపింగ్‌లో ప‌రీక్ష‌లో పాజిటివ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న చైనీస్ స్విమ్మర్లు..!

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ కోసం అమెరికా వెళ్లడం దాదాపు ఖాయమని ఇటీవ‌ల ప‌లు నివేదిక పేర్కొన్నాయి. ఈ ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ప్రపంచకప్‌లో ఆడతారు. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాణించలేకపోయిన అతని ప్రదర్శన ఆధారంగా జ‌ట్టుకు ఎంపికవుతాడా..? అనే ప్ర‌శ్న‌ అంద‌రిలోనూ ఉంది.

భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది?

2024 T20 ప్రపంచ కప్‌లో 20 జట్లు పాల్గొంటాయి. ఇవి ఒక్కొక్కటి 5 జట్లతో 4 గ్రూపులుగా విభజించబడ్డాయి. పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో కూడిన గ్రూప్‌-ఎలో భారత జట్టు చోటు దక్కించుకుంది. భారత జట్టు జూన్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 T20 World Cup
  • BCCI
  • ICC T20 world cup
  • India Squad
  • rohit sharma
  • T20 world cup

Related News

Ms Dhoni

టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

Ms Dhoni  టీ20 ప్రపంచ కప్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు. అయితే, అన్ని జట్లల

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

  • Team India

    40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • Yuvraj Singh

    రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd