BCCI Announces Tickets: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అదనపు టిక్కెట్లు..!
భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ కోసం అదనపు టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI Announces Tickets) ప్రకటించింది.
- By Gopichand Published Date - 08:15 AM, Sun - 8 October 23

BCCI Announces Tickets: భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ కోసం అదనపు టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI Announces Tickets) ప్రకటించింది. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం 14,000 అదనపు టిక్కెట్లను పంపిణీ చేసేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది.
వాస్తవానికి ప్రారంభ మ్యాచ్‌లో కాకుండా మరికొన్ని మ్యాచ్‌లలో తక్కువ మంది ప్రేక్షకులు రావడంతో BCCI ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 5 న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్టేడియంలో చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. దీని తరువాత చాలా మంది క్రికెట్ నిపుణులు టిక్కెట్లు పంపిణీ చేయాలని సలహా ఇచ్చారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ముఖ్యమైన గ్రూప్-స్టేజ్ మ్యాచ్ జరగడం గమనార్హం. మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అక్టోబర్ 8, 2023 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. క్రికెట్ అభిమానులు https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ICC క్రికెట్ ప్రపంచ కప్ అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అభిమానులు టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ నేడు చెన్నైలో జరగనుంది. దీని తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (అక్టోబర్ 14) భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌లో అభిమానుల గైర్హాజరుపై ప్రశ్నలు తలెత్తాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానుల హాజరు చాలా తక్కువగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. అయితే, టోర్నమెంట్ అధికారిక టికెటింగ్ భాగస్వామి BookMyShow, స్టేడియంలోని చాలా సీట్లు నిండిపోయాయని చూపించింది. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా మారింది. భారత్ జట్టులో రోహిత్, కోహ్లి, అశ్విన్‌లతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు కూడా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు. అందుకే ఈ టోర్నీలో విజయం సాధించి చరిత్రలో తమ పేరును లిఖించుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.