HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Baby Ab Dewald Brevis Steals The Show On Ipl Debut

Baby AB’ Dewald: అరంగేట్రం లోనే ఆకట్టుకున్న బేబీ ఏబీడీ

ఐపీఎల్‌ 2022లో ముంబై జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.

  • By Naresh Kumar Published Date - 03:42 PM, Thu - 7 April 22
  • daily-hunt
Baby
Baby

ఐపీఎల్‌ 2022లో ముంబై జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో ముంబై పరాజయం పాలయ్యింది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది హ్యాట్రిక్ ఓటమి. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు తరపున అరంగేట్రం చేసిన జూనియర్ ఎబిడి డెవాల్డ్‌ బ్రెవిస్‌ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అండర్​-19 వరల్డ్​కప్​లో దుమ్మురేపిన బ్రెవిస్​కు ఇదే తొలి ఐపీఎల్​ మ్యాచ్​ అయినా కూడా చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నాడు.. తీవ్ర ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన​ బ్రెవిస్​కు ఇదే తొలి ఐపీఎల్​ మ్యాచ్​. అయినా చక్కటి షాట్లతో అలరించాడు. కమిన్స్​, ఉమేశ్​, వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​ను ఎదుర్కొని నిలిచాడు. 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి స్టంపౌట్​గా వెనుదిరిగాడు. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్​ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్​ 8వ ఓవర్​ తొలి బంతికి డెవాల్డ్​ బ్రెవిస్ కొట్టిన నో లుక్ సిక్స్ ​ మ్యాచ్​కే హైలైట్​గా నిలిచిందని చెప్పొచ్చు. వరుణ్​ చక్రవర్తి వేసిన బంతిని డీప్​ మిడ్​ వికెట్​ మీదుగా భారీ సిక్స్ బాదిన డెవాల్డ్​ బ్రెవిస్ కనీసం బంతిని కూడా చూడకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇదిలాఉంటే.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌లో మొత్తంగా 58.88 సగటుతో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలోనే మెగా వేలంలో బ్రెవిస్‌ రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. ఇదిలా ఉంటే కోల్ కత్తాపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టులో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ 50 పరుగులు, ప్యాట్‌ కమిన్స్‌ 56 పరుగులతో చెలరేగడంతో కేకేఆర్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Baby AB' Dewald
  • cricket
  • IPL 2022
  • mumbai indians

Related News

India Squad

India Squad: పాక్‌తో మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న భార‌త్.. ఎప్పుడంటే?

టోర్నమెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు యూఏఈ (UAE)తో ఆడనుంది.

    Latest News

    • Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి

    • ‎Alcohol: ఏంటి ఇది నిజమా! చలికాలంలో మద్యం తాగితే చలి తగ్గుతుందా?

    • ‎Cardamoms: పొట్ట నిండా తిన్న తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Curd: కేవలం ఒక చెంచా పెరుగుతూ ముఖాన్ని, జుట్టుని షైనీగా మార్చుకోండిలా?

    • ‎Flowers Plants: ఈ పూల మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. కనక వర్షం కురవాల్సిందే!

    Trending News

      • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd