టీమిండియా ఆటగాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్!
దక్షిణాఫ్రికాతో నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌ల నుంచి అక్షర్ పటేల్‌ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పటేల్ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
- Author : Gopichand
Date : 15-12-2025 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
- టీమిండియాకు బ్యాడ్ న్యూస్
- టీ20 సిరీస్ నుంచి ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఔట్
- అతని స్థానంలో జట్టులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్
Axar Patel: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టి20 సిరీస్‌లోని చివరి 2 మ్యాచ్‌ల నుండి అక్షర్ పటేల్‌ను తప్పించారు. అంతకుముందు డిసెంబర్ 14న ధర్మశాలలో జరిగిన మూడవ టి20లో కూడా అక్షర్ పటేల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. అనారోగ్యం కారణంగా సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి పటేల్‌ను తప్పించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధృవీకరించింది.
అక్షర్ పటేల్ అవుట్
దక్షిణాఫ్రికాతో నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌ల నుంచి అక్షర్ పటేల్‌ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పటేల్ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో, ఐదో టి20 మ్యాచ్‌ల కోసం అక్షర్ పటేల్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. భారత్- దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో టి20 మ్యాచ్ డిసెంబర్ 17న లక్నోలో జరుగుతుంది. ఇక సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడతారు. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత జట్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.
Also Read: మహారాష్ట్రలో మరోసారి ఎన్నికల నగరా.. షెడ్యూల్ ఇదే!
🚨 NEWS 🚨#TeamIndia allrounder, Axar Patel has been ruled out of the remaining two @IDFCFIRSTBank T20Is against South Africa due to illness.
🔽 Details | #INDvSA | @akshar2026 https://t.co/CZja7iaLNm
— BCCI (@BCCI) December 15, 2025
బుమ్రా రీ-ఎంట్రీ
గతంలో వ్యక్తిగత కారణాల వల్ల జస్‌ప్రీత్ బుమ్రా ఇంటికి తిరిగి వెళ్లారు. అందువల్ల అతను ధర్మశాలలో జరిగిన మూడవ మ్యాచ్ ఆడలేదు. శుభవార్త ఏమిటంటే.. బుమ్రాను చివరి 2 మ్యాచ్‌ల కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి తిరిగి తీసుకున్నారు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.