Asian Games 2023: ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న బాక్సర్ లోవ్లినా
- By Praveen Aluthuru Published Date - 04:49 PM, Tue - 3 October 23

Asian Games 2023: ఈ రోజు మంగళవారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. లోవ్లినా బోర్గోహైన్ సెమీ-ఫైనల్‌లో 5-0తో థాయిలాండ్‌కు చెందిన బైసన్ మనీకోన్‌ను ఓడించి 75 కేజీల విభాగం ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అక్టోబర్ 3వ తేదీ ఆదివారం వరకు ఆసియా క్రీడల్లో భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు మరియు 25 కాంస్యాలతో మొత్తం 62 పతకాలను గెలుచుకుంది.
భారత బాక్సర్ ప్రీతీ పవార్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో ముగించింది. 54 కేజీల సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన చాంగ్ యువాన్‌తో తలపడింది. అయితే బాగా రాణించినప్పటికీ ప్రీతి 0-5 స్కోరుతో ఓడిపోయింది.
Also Read: Jagan Delhi Secret : జగన్ `ముందు`కు..! ఢిల్లీ అందుకే..!!