HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Arjun Tendulkar Impresses In Ranji Trophy 2025 26

Arjun Tendulkar: కర్ణాటకతో మ్యాచ్‌లో మెరిసిన అర్జున్ టెండూల్కర్!

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 110.1 ఓవర్లలో 371 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున కరుణ్ నాయర్ 267 బంతుల్లో 174 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ గోపాల్ 109 బంతుల్లో 57 పరుగులు చేశాడు.

  • Author : Gopi Date : 27-10-2025 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arjun Tendulkar
Arjun Tendulkar

Arjun Tendulkar: రంజీ ట్రోఫీ 2025-26లో మొత్తం 38 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 25 నుంచి రౌండ్ 2 మ్యాచ్‌లు జరుగుతుండగా ఇందులో కర్ణాటక, గోవా జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గోవా తరఫున సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ముందుగా బౌలింగ్‌లో తన సత్తా చాటగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ప్రస్తుతం అర్జున్ ప్రదర్శన క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బంతితో కట్టుదిట్టమైన బౌలింగ్

కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కర్ణాటక ఓపెనర్ నికిన్ జోస్‌ను, అలాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కృష్ణన్ శ్రీజిత్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అభినవ్ మనోహర్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఈ విధంగా గోవా తరఫున తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అర్జున్ 29 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి 3.44 ఎకానమీ రేటుతో మూడు వికెట్లు తీశాడు. అతనితో పాటు గోవా తరఫున వాసుకి కౌశిక్ కూడా మూడు వికెట్లు తీశాడు.

Also Read: CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు

బౌలింగ్ చేసిన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచాడు. అతను 115 బంతుల్లో 43 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. నాల్గో రోజు గోవా జట్టు అతనిపై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో గోవా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అర్జున్ కావడం విశేషం.

మ్యాచ్ పరిస్థితి ఇలా ఉంది

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 110.1 ఓవర్లలో 371 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున కరుణ్ నాయర్ 267 బంతుల్లో 174 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ గోపాల్ 109 బంతుల్లో 57 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. గోవా ఇంకా 200 పరుగుల వెనుకంజలో ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arjun Tendulkar
  • cricket news
  • Ranji Trophy 2025-26
  • sachin tendulkar
  • sports news

Related News

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd