HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Anushka Sharma Dances Energetically With Kohli

Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్‌ఫుల్‌ డ్యాన్స్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 01-06-2026 - 10:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anushka Sharma Dances Energetically with Kohli
Anushka Sharma Dances Energetically with Kohli

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఘన విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండో కప్పును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత.. పిచ్‌పై ఎంత హంగామా జరిగిందో, అంతకు మించిన అసలైన సెలబ్రేషన్స్ ‘ఆఫ్టర్ పార్టీ’లో ఆవిష్కృతమయ్యాయి.

కెప్టెన్ రజత్ పటీదార్, జట్టు సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కుటుంబాలతో కలిసి చేసుకున్న సక్సెస్ పార్టీలో.. స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆర్సీబీ అధికారికంగా పంచుకున్న ఈ వీడియోలో ఈ జంట ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ, ఆనందంతో ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కనిపించారు. ఈ వేడుకల్లో విరాట్ కోహ్లీ తన జట్టు బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో కలిసి వేసిన మాస్ స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే, ఈ పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం విరాట్ కోహ్లీ ధరించిన ప్రత్యేకమైన టీషర్ట్. దానిపై “One felt nice, we did twice” (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది, కానీ మేము రెండుసార్లు చేసి చూపించాం) అని రాసి ఉన్న క్యాప్షన్ ఆర్‌సీబీ సాధించిన బ్యాక్ టు బ్యాక్ టైటిల్ విజయానికి పక్కాగా సరిపోయింది. ఈ కూల్ టీషర్ట్‌తో ఉన్న కోహ్లీ ఫొటోను అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జత చేసింది.

అంతకుముందు మ్యాచ్ ముగిసిన వెంటనే వీఐపీ స్టాండ్స్‌లో ఉన్న అనుష్క లేచి నిలబడి చప్పట్లతో భర్తను, జట్టును అభినందించగా.. మైదానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఆమె వైపు చూస్తూ గాల్లోకి ముద్దులు (ఫ్లయింగ్ కిస్సెస్) విసరడం, దానికి ఆమె మురిసిపోవడం వంటి దృశ్యాలు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. భర్త సాధించిన చారిత్రాత్మక విజయంలో భాగస్వామి అవుతూ అనుష్క శర్మ చేసిన సందడి ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

𝗞𝗶𝗻𝗴 𝗞𝗼𝗵𝗹𝗶’𝘀 𝗺𝗮𝘀𝘁𝗲𝗿𝗰𝗹𝗮𝘀𝘀 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗱𝗮𝗻𝗰𝗲 𝗳𝗹𝗼𝗼𝗿 😉

Pure vibes. Wholesome. And so much more. Anushka Sharma, thank you for being our Day 1. ❤️ pic.twitter.com/7Qmxxv6QtG

— Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anushka sharma
  • Anushka Sharma-Virat Kohli
  • IPL celebrations
  • IPL Final Match
  • IPL FINAL Winner
  • RCB vs GT
  • royal challengers bangalore
  • virat kohli

Related News

IPL Title for RCB for the Second Consecutive Time

IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

పద్దెనిమిదేళ్లు.. ఒకే ఒక్క టైటిల్ కోసం ఆ జట్టు పడ్డ తపన, అభిమానులు ఎదురుచూసిన నిరీక్షణ అంతా ఇంతా కాదు. కానీ, గెలిచిన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి వారికి పట్టిన సమయం మాత్రం కేవలం పన్నెండు నెలలే! అవును, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత లీగ్‌లో తమకంటూ ఒక తిరుగులేని సామ్

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

  • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd