HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Drinking Water Problem In Mangalagiri Resolved Through Minister Nara Lokeshs Initiative

Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

  • Author : Vamsi Chowdary Korata Date : 01-06-2026 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drinking Water Problem in Mangalagiri Resolved Through Minister Nara Lokesh's Initiative
Drinking Water Problem in Mangalagiri Resolved Through Minister Nara Lokesh's Initiative

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్ కార్పొరేషన్‌ తాగునీటి సమస్యకు చెక్ పెట్టే పనిలో ఉంది. 24 గంటలూ నీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.393 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. భవిష్యత్ అవసరాలను కూడా గుర్తించి అందుకు తగిన విధంగా ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో తాగునీటి సమస్యలకు చెక్ పెట్టే పనిలో ఉంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ)లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించబోతోంది. ఏకంగా రూ.393.74 కోట్లతో శాశ్వత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయబోతోంది. మొత్తం 40 డివిజన్లు ఉండగా.. వాటిలోని 29 జోన్‌లలో పైప్‌లైన్లలో 24 గంటలూ సురక్షిత తాగునీటిని సరఫరా చేయనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు కలిసి సమన్వయంతో ఈ ప్రాజెక్టను తీసుకొస్తున్నారు. ఈ తాగునీటి పథకానికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 2.67 లక్షల జనాభా ఉన్నారు.. అయితే 2055 నాటికి జనాభా 4.47 లక్షల వరకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రోజూ 88.5 మిలియన్‌ లీటర్ల నీరు కావాలని అంచనా వేశారు అధికారులు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా హెచ్‌డీపీఈ పంపిణీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం 644 కిలోమీటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఈఎల్‌ఎస్‌ఆర్‌లు (27 కొత్త ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు) నిర్మించనున్నారు. ప్రస్తుతం మూడు రిజర్వాయర్లు ఉన్నాయి.. వీటితో కలిపి మొత్తం 30 ఈఎల్‌ఎస్‌ఆర్‌లు అందుబాటులో ఉంటాయి. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో కొత్తగా 19 వేలకుపైగా ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్లాన్ చేశారు. నగరంలోని ప్రాంతాలతో పాటుగా గ్రామాలనకు కూడా నీటిని సరఫరా చేసేందుకు జోన్ వ్యవస్థను కూడా తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఈ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌‌లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం యూఐడీఎఫ్‌ నుంచి రూ.287.54 కోట్లు, అమృత్‌ 2.0లో రూ.51.20 కోట్లు, సీఆర్‌డీఏ నుంచి రూ.55 కోట్లు సమకూరనున్నాయి. సీఆర్డీఏకి సంబంధించిన రింగ్ మెయిన్ల ద్వారా ప్యూరిఫై చేసిన నీళ్లను రోజూ అందిస్తారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఉండవల్లిలో ఉన్న ట్యాపింగ్ పాయింట్ నుంచి తాడేపల్లికి నీళ్లు సరఫరా చేస్తారు. అమరావతిలో ఉన్న ఎంఐజీ లేఅవుట్‌ దగ్గర మరో పాయింట్‌ నుంచి మంగళగిరికి నీరు సరఫరా చేస్తారు. వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్, రా వాటర్ అవసరం లేకపోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయంలో రూ.56.50 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • Drinking Water Supply
  • mangalagiri
  • Minister Nara lokesh
  • Municipal corporation
  • tadepalli

Related News

    Latest News

    • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

    • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

    • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

    • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

    • Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd