Suyash Sharma: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో మిస్టరీ స్పిన్నర్.. ఎవరీ సుయాష్ శర్మ..?
సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో మిస్టరీ స్పిన్నర్ లభించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ పేరు సుయాష్ శర్మ (Suyash Sharma).
- By Gopichand Published Date - 02:38 PM, Fri - 7 April 23

సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో మిస్టరీ స్పిన్నర్ లభించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ పేరు సుయాష్ శర్మ (Suyash Sharma). ఈ 19 ఏళ్ల బౌలర్ తన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లోనే కొన్ని రహస్యమైన బంతులు వేసి RCB బ్యాట్స్‌మెన్‌లను ఆశ్చర్యపరిచాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సుయాష్ మూడు వికెట్లు తీశాడు. గురువారం (ఏప్రిల్ 6) IPLలో KKR, RCB మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 204 పరుగులు చేసింది. దీని తర్వాత సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల త్రయం ఆర్‌సిబిని కేవలం 123 పరుగులకే నిలిపివేసింది. ఇక్కడ KKR 81 పరుగుల తేడాతో గెలిచింది. వరుణ్ నాలుగు, సుయాష్ మూడు, సునీల్ రెండు వికెట్లు తీశారు. వరుణ్, సునీల్ గురించి అందరికీ తెలుసు కానీ సుయేష్ శర్మ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది.
సుయాష్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దించారు. నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మలకు పెవిలియన్ పంపాడు. సుయాష్ శర్మ ఢిల్లీలో జూనియర్ స్థాయిలో క్రికెట్ ఆడాడు. అతని షాకింగ్ స్పిన్ బౌలింగ్ కారణంగా అతను KKR దృష్టిలో పడ్డాడు. KKR.. అతని ప్రతిభను గుర్తించి IPL వేలంలో 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేశారు.
Also Read: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ హూడీపై చర్చ.. ఆర్యన్ హూడీని షారుఖ్ వేసుకొచ్చాడా..!
Anuj Rawat ☑️
Dinesh Karthik ☑️Watch Suyash Sharma pick two quick wickets in his debut game.
Live – https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4
— IndianPremierLeague (@IPL) April 6, 2023
టాప్ లెవల్‌లో ఏ మ్యాచ్ కూడా ఆడలేదు
ఇక్కడ విశేషమేమిటంటే సుయాష్ ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్‌లో టాప్ లెవల్‌లో ఏ మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే అతను ఏ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కనిపించలేదు .లిస్ట్-ఎ, టి20 మ్యాచ్‌లు ఆడలేదు. KKR vs RCB పెద్ద ప్లాట్‌ఫామ్‌పై అతని మొదటి మ్యాచ్. ఈ మొదటి మ్యాచ్‌లోనే సుయాష్ బ్యాట్స్ మెన్ కు భయాందోళనలు సృష్టించాడు.