నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుండి కోలుకుని నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
- Author : Gopichand
Date : 08-02-2026 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. అమెరికా జట్టుపై అద్భుత విజయం సాధించి టోర్నమెంట్లో బోణీ కొట్టిన టీమిండియా ఇప్పుడు తన తదుపరి పోరుకు సిద్ధమవుతోంది. లీగ్ దశలో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ పోరుకు ముందు భారత జట్టుకు సంబంధించి ఐదు కీలక అప్డేట్స్ వెలువడ్డాయి. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చింది.
టీమిండియా టాప్ 5 అప్డేట్స్
వాషింగ్టన్ సుందర్ పునరాగమనం
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుండి కోలుకుని నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమాచారం ప్రకారం.. సుందర్ ఢిల్లీలో జట్టుతో చేరనున్నారు. ఇది జట్టు స్పిన్ విభాగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్
జ్వరం కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. నమీబియా మ్యాచ్ నాటికి అతను వంద శాతం ఫిట్నెస్ సాధించి, తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!
అభిషేక్ శర్మ ఆరోగ్యం
తొలి మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఫీల్డింగ్‌కు రాని యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు కోలుకుంటున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. తదుపరి మ్యాచ్ సమయానికి అతను పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
అమెరికాపై సాధించిన ఘనవిజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండటంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది.
పిచ్- వ్యూహాలు
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. బుమ్రా తిరిగి వస్తే సిరాజ్‌తో కలిసి అతను పవర్ ప్లేలో కీలకం కానున్నాడు. అలాగే సుందర్ అందుబాటులోకి వస్తే బౌలింగ్ వైవిధ్యం పెరుగుతుంది.