Glenn Maxwell: మాక్స్‌వెల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆర్సీబీ.. కారణమిదే..?
బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు.
- By Gopichand Published Date - 12:00 PM, Wed - 4 September 24
Glenn Maxwell: ఈసారి IPL 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుండి బలమైన ఆటగాడు విడుదల కావచ్చు. ఈ ఆటగాడు మొదటి కొన్ని సీజన్లలో RCB కోసం అద్భుతంగా ఆడాడు. కానీ IPL 2024లో చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చాడు. బ్యాట్ లేదా బంతితో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. దీని కారణంగా ఈ ఆటగాడు IPL 2024ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ప్లేయర్‌ని విడుదల చేయడానికి మూడు పెద్ద కారణాలు తెరపైకి వచ్చాయి. దీని కారణంగా RCB ఈ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ను మెగా వేలానికి ముందే విడుదల చేయవచ్చు.
గ్లెన్ మాక్స్‌వెల్ 3 కారణాల వల్ల RCB నుండి వైదొలగవచ్చు
IPL 2024లో పేలవమైన ప్రదర్శన
IPL 2024 గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell)కు కలిసిరాలేదు. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఈ సీజన్‌లో మాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో 52 పరుగులు మాత్రమే వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్‌కి గురయ్యాడు. అంతేకాకుండా నిరంతర ఫ్లాప్‌ల కారణంగా మాక్స్‌వెల్ కూడా ఈ సీజన్‌ను మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది. కానీ టోర్నీ ముగిశాక మళ్లీ జట్టులోకి వచ్చాడు.
Also Read: Pakistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారిన పాక్..!
పేలవ బౌలింగ్
బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. బౌలింగ్‌లో మాక్స్‌వెల్ 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఆర్సీబీకి నుంచి మాక్స్‌వెల్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కవు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి.
మ్యాక్స్‌వెల్ స్వయంగా సూచనలు ఇచ్చాడు
కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. గ్లెన్ మాక్స్‌వెల్ సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అన్‌ఫాలో చేసినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. దీని తర్వాత RCB మ్యాక్స్‌వెల్‌ను విడుదల చేయబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈసారి మెగా వేలంలో మాక్స్‌వెల్ ను కూడా వేలం వేయడాన్ని చూడవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Kumar Sangakkara: కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర..?
సంగక్కర కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా మారడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సంగక్కర కేకేఆర్‌కు మెంటార్‌గా మారితే.. గౌతమ్ గంభీర్ స్థానాన్ని భర్తీ చేసినట్లే అవుతోంది.