India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. 10 సెకన్లకు రూ. 30 లక్షలు..!
ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. టోర్నమెంట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 02:14 PM, Wed - 30 August 23

India vs Pakistan: ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. టోర్నమెంట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇది బ్రాడ్‌కాస్టర్‌కు డిమాండ్‌ను పెంచుతుంది. రాబోయే ఆసియా కప్ సందర్భంగా భారత్ రెండు గ్రూప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఆసియా కప్-2023తో డిస్నీ హాట్ స్టార్ కు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు యాడ్ రెవెన్యూ రానుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం 10 సెకన్ల యాడ్ కాస్ట్ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కాకుండా ఇతర జట్లు ఆడే మ్యాచ్ లకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి భారత్- పాక్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. టోర్నీని ఫ్రీగా వీక్షించొచ్చు.
శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 ఆసియా కప్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త. భారతీయ అభిమానులు ఇప్పుడు ఆసియా కప్‌లోని అన్ని మ్యాచ్‌లను ఉచితంగా, HDలో వీక్షించగలరు. ఇకపై మొబైల్‌తో పాటు టీవీలో కూడా ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. దీని కోసం దూరదర్శన్ పెద్ద ప్రకటన చేసింది.
Also Read: Asia Cup 2023: పాకిస్థాన్ తుది జట్టు ఇదే
DD స్పోర్ట్స్ HD ఛానెల్‌లో భారతీయ అభిమానులు ఆసియా కప్‌లోని అన్ని మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించగలరు. ఇందుకోసం వారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి ముందు DD స్పోర్ట్స్ HD లేదు. అయితే ఇది ఆసియా కప్‌తో మొదలవుతోంది. టీమ్ ఇండియా అభిమానులకు ఇది పెద్ద కానుక కాదు. ఇంతకుముందు హాట్‌స్టార్ మొబైల్‌లో ఆసియా కప్‌ను ఉచితంగా చూపిస్తామని ప్రకటించింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్‌కు పూర్తి సన్నద్ధం కావడం గమనార్హం. టీమిండియా బుధవారం శ్రీలంకకు బయలుదేరింది. మొదటి మ్యాచ్ పల్లెకెలెలో శనివారం జరగనుంది. నేపాల్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా పల్లెకెలెలో జరగనుంది. కేఎల్ రాహుల్ భారత జట్టుతో కలిసి శ్రీలంక వెళ్లలేదు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ ఆడలేడు.