Asia Cup 2023: పాకిస్థాన్ తుది జట్టు ఇదే
వన్డే ప్రపంచ కప్ కు ముందు మినీ ప్రపంచ గా భావించే ఆసియా కప్ 2023 ఈ రోజు ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ముల్తాన్ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యం ఇస్తున్నది.
- Author : Praveen Aluthuru
Date : 30-08-2023 - 2:08 IST
Published By : Hashtagu Telugu Desk
Asia Cup 2023: వన్డే ప్రపంచ కప్ కు ముందు మినీ ప్రపంచ గా భావించే ఆసియా కప్ 2023 ఈ రోజు ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ముల్తాన్ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యం ఇస్తున్నది. ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పసికూనగా భావించే నేపాల్ అగ్రశ్రేణి జట్టు పాకిస్థాన్ తో తలపడబోతుంది. పైగా నేపాల్ తొలిసారి ఆసియా కప్ కు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్థాన్ రెండు సీజన్లలో ఆసియా కప్ గెలుచుకుంది. విశేషం ఏంటంటే ప్రస్తుతం పాకిస్థాన్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఒక చిన్న జట్టు బలమైన జట్టుతో ఎలా పోరాడుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్లు ఇంతవరకు క్రికెట్ ఏ ఫార్మెట్లోనూ పోటీ పడలేదు. మరి పటిష్టమైన పాకిస్థాన్‌కు ఆ జట్టు ఏ మేర పోటీనిస్తుందో చూడాలి.
ఆసియా కప్ కి ఎంపికైన తుది జట్టులో కెప్టెన్ బాబర్ ఆజామ్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇప్తికర్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్(కీపర్), మహమ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్ లు ఉన్నారు.
Also Read: AP: రాఖీ పర్వదినాన..ఆడవారికి రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్