AP CM Jagan : జులై 13న వైజాగ్‌లో పర్యటించనున్న సీఎం జగన్.. వాహనమిత్ర చెక్కుల పంపిణీ
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
- By Prasad Published Date - 10:25 AM, Mon - 11 July 22

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఉదయం 11:00 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లి 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైఎస్‌ఆర్ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు. అనంతరం వైఎస్‌ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్ ఉంటుంది. షెడ్యూల్‌లో భాగంగా ఉదయం 11.40 నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు, అనంతరం 11.45 నుంచి 11.47 వరకు వాహన మిత్ర పథకంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి 12.17 గంటల వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నేతలతో సమావేశమై 1.20 గంటలకు గన్నవరం చేరుకుంటారు.