Yadavula Sadar : ఎన్టీఆర్ స్టేడియంలో యాదవులు సదర్ సమ్మేళనం.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Yadavula Sadar : తెలంగాణ సదర్ సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో యాదవ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ఈ సమేళనంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఈ యాదవుల సదర్ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
- By Kavya Krishna Published Date - 10:05 AM, Sun - 27 October 24

Yadavula Sadar : రాజకీయ, కుల మతాలకు అతీతంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు (అక్టోబర్ 27)న తెలంగాణ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ తెలంగాణ సదర్ సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో యాదవ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ఈ సమేళనంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఈ యాదవుల సదర్ సమ్మేళనంలో పాల్గొననున్నారు. అయితే.. యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలు అతి వైభవంగా జరిగి, సమాజంలోని వారి వృత్తి, జీవన విధానం , సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ ఉత్సవాలు ప్రత్యేకించి హైదరాబాదులో, దీపావళి సమయంలో జంట నగరాల్లో ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను “వృషభోత్సవం” అని కూడా పిలుస్తారు. సదర్ అనే ఉర్దూ పదం “ఆత్మ విశ్వాసం” , “లీడర్” అనే అర్థాలను కలిగి ఉంది, అయితే హైదరాబాదీ భాషలో దీనికి “ప్రధానమైనది” అనే అర్థం ఉంది.
చరిత్ర
యాదవుల సదర్ ఉత్సవాలకు దీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఉత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు నాగరికతలో ప్రారంభమయ్యాయని చెప్తారు. ఈ పండుగలు దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికీ, కాలక్రమేణా, అవి కొన్ని ప్రాంతాలకు పరిమితమైనాయి. తెలంగాణలో, ఇవి దేవగిరి యాదవ రాజుల కాలంలో ముఖ్యంగా వ్యాపించాయి. ఈ రాజులు కాకతీయుల కంటే ముందు గొల్లకొండలో నివసించేవారు. గొల్లకొండ ప్రాంతాన్ని పాలించే యాదవుల రాణి కుతుబ్ షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని వీరమరణం పొందింది. ఈ సంఘటనను పురాణాల్లో అందరూ గుర్తిస్తారు. కాలానుగుణంగా, యాదవులు కుతుబ్ షాహీ, మొగల్, నిజాం కాలాలలో సైనికాధికారులుగా పనిచేశారు. నిజాం వారి ప్రోత్సాహంతో గౌలిగూడ అనే ప్రదేశానికి ఇనామ్ పొందారు. ఈ ఉత్సవాలు అక్కడ ప్రారంభమైనట్లు ఒక నానుడి ఉంది.
యాదవుల లక్ష్మీ పండగ
దీపావళి పండుగ సమయంలో, వ్యవసాయ పనులలో దున్నలు, గేదెలు, ఆవులతో సంబంధించి కష్టపడి పని జరుగుతుంది. ఈ సమయంలో పశువులు సమృద్ధిగా మేతను తింటూ, బలంగా తయారై, తమ సంతతిని పునరుత్పత్తి చేసే దశకు చేరుకుంటాయి. ఈ ఉత్సవాలు ప్రధానంగా మేలు జాతి జంతువులను ఉత్పత్తి చేసే క్రమంలో పుట్టుకొచ్చాయి. అప్పట్లో, దున్నలలో మేలు జాతిని ఎంపిక చేసి, దున్న రాజును, దాని యజమానిని ఘనంగా సత్కరించడం జరుగుతుండేది. అలా పండుగ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు గిత్త , కృష్ణా పరివాహక ప్రాంతాలలో దక్కనీ గొర్రెలను ఉత్పత్తి చేసేవారు. ఈ జాతులు ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందాయి. ఈ విధంగా, యాదవుల సదర్ ఉత్సవాలు సమాజం, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే స్ఫూర్తిదాయకమైన వేడుకలుగా కొనసాగుతున్నాయి. ఇవి కేవలం సాంస్కృతిక ఉత్సవాలే కాకుండా, సమాజంలో ఐక్యత, అభివృద్ధి, ఆనందాన్ని ప్రోత్సహించే అవకాశాలను కూడా అందిస్తాయి.
Sweat Odor : వీటిని నీటిలో వేసి స్నానం చేస్తే మీ శరీరం నుండి చెమట వాసన రాదు.!