Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్తుండగా ఏం జరిగిందంటే!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ వ్యక్తి ఓ స్కూటర్‌పై నుంచి పడిపోయారు.
- By Balu J Published Date - 05:21 PM, Wed - 9 August 23

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంటుకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ వ్యక్తి ఓ స్కూటర్‌పై నుంచి పడిపోయారు. ఇది గమనించిన రాహుల్ వెంటనే కారు దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది అతనిని లేపగా అనంతరం రాహుల్ స్కూటర్ ను లేపి ఆ వ్యక్తితో మాట్లాడారు. దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడిగారు. ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండమని అతనికి సూచనలు చేశారు. ఆ వ్యక్తికి కరచాలనం చేసి వెంటనే అక్కడ నుంచి బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Also Read: AP BRS: వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రజలు సిద్దం