TMC In Lead : ఆధిక్యంలో దీదీ పార్టీ.. బెంగాల్ పంచాయతీ పోల్స్ కౌంటింగ్ షురూ
TMC In Lead : ఇటీవల హింసాకాండ నడుమ జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది.
- By Pasha Published Date - 09:00 AM, Tue - 11 July 23

TMC In Lead : ఇటీవల హింసాకాండ నడుమ జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల కౌంటింగ్ 6 రౌండ్లలో జరగనుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించలేదు. దీంతో బ్యాలెట్ పత్రాలను భౌతికంగా లెక్కిస్తున్నారు. తొలుత గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత పంచాయతీ సమితులు, చివరిగా జిల్లా పరిషత్‌ల ఓట్లను కౌంట్ చేస్తారు. 339 కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో కంపెనీ కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ పోలీసులను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సీనియర్ అధికారులు మాత్రమే సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
Also read : 2 Pawars-Modi Event : ఆగస్టు 1న మోడీ ప్రోగ్రాంకు శరద్ పవార్, అజిత్ పవార్
ఈరోజు ఓట్ల లెక్కింపును సమీక్షించేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సమస్యాత్మకంగా ఉన్న భాంగర్, కానింగ్, దక్షిణ 24 పరగణాల జిల్లాలను సందర్శించనున్నారు. జూన్ 8న మూడంచెల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 22 జిల్లాల్లోని 63,229 గ్రామ పంచాయతీ సీట్లు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఓటింగ్ జరగగా, 80.71 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల బ్యాలెట్ బాక్సులను కొల్లగొట్టి, నిప్పుపెట్టి హింసకు దారితీసింది.
- 317 గ్రామ పంచాయతీ స్థానాల్లో కౌంటింగ్ మొదలు కాగా 174 స్థానాల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.
- 341 పంచాయతీ సమితి స్థానాల్లో కౌంటింగ్ మొదలు కాగా 28 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.