Kohli – 15 Years – 10 Things : కోహ్లీ 15 ఏళ్ల క్రికెట్ జర్నీ.. 10 ఆసక్తికర విశేషాలు
Kohli - 15 Years - 10 Things : విరాట్ కోహ్లి.. క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన ఒక సామాన్యుడు.. ఇప్పుడు ఆయన అసామాన్యుడు.. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు..
- By Pasha Published Date - 12:01 PM, Fri - 18 August 23
Kohli – 15 Years – 10 Things : విరాట్ కోహ్లి.. క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన ఒక సామాన్యుడు..
ఇప్పుడు ఆయన అసామాన్యుడు.. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు..
సోషల్ మీడియాలో కోహ్లి హవా అంతా ఇంతా కాదు..
నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి ఆడుగుపెట్టి 15 సంవత్సరాలు గడిచాయి..
ఈసందర్భంగా అతని కెరీర్ తో ముడిపడిన 11 ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం..
Also read : Air India ✈ : ₹.1,470/- కి ఎయిర్ ఇండియా విమాన టికెట్.. ప్రయాణికులకు బంపరాఫర్
1. 2008 ఆగస్టు 18న అరంగేట్రం
విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో విరాట్ ఓపెనింగ్‌లో 12 రన్స్ కే ఔటయ్యాడు. కానీ దీని తర్వాత.. గత 15 ఏళ్లలో బ్యాటింగ్‌లో ఎన్నో పెద్ద రికార్డులను బద్దలు కొట్టాడు. 20-20 మ్యాచ్ లలో అతని రికార్డు సాటిలేనిది.
2. 15 ఏళ్లలో 510 కిలోమీటర్ల పరుగు
విరాట్ కోహ్లీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో 22 గజాల పిచ్‌ల మధ్య 510 కిలోమీటర్ల దూరం పరుగెత్తి రన్స్ చేశాడు. బౌండరీలు, సిక్స్ లు మినహా ఇతర షాట్ లు కొట్టి రన్స్ కోసం వికెట్ల మధ్య దాదాపు 277 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడు. తన తోటి బ్యాట్స్ మెన్ తో కలిసి 233 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడు .
3. బాల్ వేయకుండానే వికెట్ తీశాడు
టీ20లో లీగల్ గా బాల్ వేయకుండానే విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. 2011లో అతను T20లోతన మొదటి బంతికే కెవిన్ పీటర్సన్‌ను స్టంపౌట్ చేశాడు. అయితే ఆ బాల్ వైడ్. అందుకే బాల్ వేయకుండానే వికెట్ తీయగలిగాడు. పురుషుల క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా జియోర్త్ (Zeorth) బాల్‌తో వికెట్ తీసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli – 15 Years – 10 Things) మాత్రమే.
4. 83 వేదికలు.. 46 సెంచరీలు
కోహ్లీ 83 వేదికలపై మ్యాచ్‌లు ఆడి 46 సెంచరీలు చేశాడు. ఈవిషయంలో సచిన్ టెండూల్కర్ మాత్రమే అతని కంటే ముందున్నాడు. టెండూల్కర్ 53 వేర్వేరు వేదికలపై సెంచరీలు సాధించాడు. కోహ్లీ తన 76 అంతర్జాతీయ సెంచరీలలో 5 సెంచరీలను ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానంలో చేశాడు.
Also read : CTET Exam: సీ-టెట్ రాస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!
5. టార్గెట్ ఛేజింగ్‌లో హీరో
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆట అదుర్స్ అనిపించింది. 2014, 2016లలో జరిగిన T20 ప్రపంచ కప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అతడు టార్గెట్ ఛేజింగ్‌లలో అత్యుత్తమ రికార్డును కలిగి ఉన్నాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన 10 మ్యాచుల్లో 9 భారత్ గెలిచింది. ఇందులో విరాట్ 8 పర్యాయాలు నాటౌట్‌గా నిలవడం విశేషం. ఈ 10 మ్యాచ్‌ల్లో కోహ్లి సగటు రన్ రేట్ 270.
6. విదేశాల్లోనూ సెంచరీలతో హవా
కోహ్లి 9 దేశాలపై వన్డేలు ఆడగా.. అన్నింటిపై సెంచరీ కొట్టాడు. టెస్టు క్రికెట్లో 8 దేశాలపై ఆడగా.. 7 దేశాలపై సెంచరీ కొట్టాడు. కానీ బంగ్లాదేశ్ పై 100 రన్స్ చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టూర్ కు ఇండియా టీమ్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన టెస్టులు, ODIలలో కోహ్లి సెంచరీలు బాదాడు. ఈ రికార్డు కలిగిన మరో ఇద్దరు ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర (శ్రీలంక) మాత్రమే.
7. 10 వన్డే ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు
2018లో ఫిబ్రవరి – అక్టోబర్ మధ్య కోహ్లీ 10 వన్డే ఇన్నింగ్స్‌లలో దాదాపు 1000 పరుగులు చేశాడు. కోహ్లీ తన 197వ మ్యాచ్ నుంచి 206వ మ్యాచ్ మధ్య 142 పరుగుల సగటు రన్ రేట్ తో 5 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో మొత్తం 995 పరుగులను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. 10 వన్డే ఇన్నింగ్స్‌లలో ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2016 అక్టోబరు నుంచి 2017 జూన్ మధ్య డేవిడ్ వార్నర్ 857 పరుగుల రికార్డును నెలకొల్పగా, కోహ్లీ దాన్ని బద్దలు కొట్టాడు.
8. 52 బంతుల్లోనే సెంచరీ
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన జైపూర్ వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డేల్లో భారత్‌కు ఇదే వేగవంతమైన సెంచరీ. ఈ సిరీస్‌లోనే నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ లో 61 బంతుల్లో సెంచరీ కొట్టాడు. వన్డేల్లో భారత్‌కు ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 30వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు. దీంతో 25 ఓవర్ల తర్వాత వన్డేల్లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కెవిన్ పీటర్సన్, అబ్దుల్ రజాక్, జాకబ్ ఓరమ్ ఒకసారి ఇలా చేశారు.
Also read : WhatsApp Feature – HD Photos : వాట్సాప్‌లో ఇక HD ఫొటోలు సెండ్ చేసే ఫీచర్
9. 33 ఇన్నింగ్స్ లు 9 సెంచరీలు
వన్డేల్లో ఇండియా టీమ్ 300 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు కొట్టాడు. ఇటువంటి 33 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 9 సెంచరీలు చేశాడు.
10. 19 ఏళ్ల 287 రోజుల వయసులో
విరాట్ కోహ్లీ 19 ఏళ్ల 287 రోజుల వయసులో 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను ఓపెనింగ్ బ్యాటింగ్ చేసి, పురుషుల ODIలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును సాధించాడు. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది.
Related News
Pak vs Ire: చెలరేగిన బాబర్ – రిజ్వాన్.. టీమిండియాకు హెచ్చరికలు
బాబర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థి భారత్ అని, కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పాడు. దీంతో రానున్న మెగా టోర్నీలో బాబర్ సేన టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భారత్ తో ఆడాలని ఆరాటపడుతుంది