Vikarabad Man: పోలీస్ సార్.. బీర్ ప్లీజ్!
ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం, ఇతర ప్రమాదాలు, నేరాలను అరికట్టేందుకు పోలీసులు 100 డయల్ నంబర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 05:56 PM, Tue - 10 May 22

ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం, ఇతర ప్రమాదాలు, నేరాలను అరికట్టేందుకు పోలీసులు 100 డయల్ నంబర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆకతాయిలు 100కు ఫోన్ చేస్తూ.. పోలీసులను ఆట కట్టిస్తున్న వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన వ్యక్తి 100 కు డయల్ చేసిన పోలీసులకు షాక్ ఇచ్చాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన జనిగెల మధు అనే వ్యక్తి మద్యం మత్తులో 2 గంటలకు 100కి డయల్ చేశాడు. అత్యవసర పరిస్థితి నుండి తనను రక్షించమని పోలీసులను కోరాడు. ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడేమోనని భావించిన పోలీసులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. తీరా విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తనకు రెండ్ బీర్ బాటిల్స్ కావాలని అడగడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వైన్ షాపులు మూసి ఉండడంతో పాటు ఇంట్లో మద్యం నిల్వలు అయిపోయాయని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసినందుకు వ్యక్తిని అరెస్టు చేశారు.