మరోవైపు సోమవారం రోజు సిరియాలోని అన్-టాన్ఫ్ వద్ద ఉన్న అమెరికా సైనిక శిబిరంపై డ్రోన్ దాడికి యత్నం జరిగింది. అయితే దాడి చేసేందుకు వచ్చిన ఆ రెండు డ్రోన్లను అమెరికా ఆర్మీ కూల్చేసింది. ఇటీవల ఇరాక్ లోని అమెరికా ఆర్మీ బేస్ పై కూడా మిస్సైల్ ఎటాక్స్  జరిగాయి. ఇంకోవైపు తాజాగా యెమన్ దేశంలోని హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సముద్రతీరంలోని అమెరికా యుద్ధ నౌకలపైకి క్రూయిజ్ మిస్సైళ్లతో దాడికి యత్నించారు. వాటిని అమెరికా ఆర్మీ అడ్డుకొని కూల్చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.