Tirupathi Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
- By Balu J Published Date - 11:28 PM, Mon - 27 November 23

Tirupathi Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఒకదాన్ని మరోటి బలంగా ఢీకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, 14 మందికి గాయలయ్యాయి. ఒక ఆటో కూలీలతో వెళ్తోంది. ఎదురుగా వస్తున్న మరో ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. కొందరికి తీవ్రగాయాలు కాగా వెంటనే క్షతగాత్రులను సమీపంలోని రాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.