TTD : రేపు ఆగస్టు నెల అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనున్న టీటీడీ
అంగప్రదక్షిణం టోకెన్లను రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
- By Prasad Published Date - 10:25 AM, Tue - 19 July 22

ఆగష్టు నెల అంగప్రదక్షిణం టోకెన్లను రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంగప్రదక్షిణం టోకెన్లు శుక్రవారం మినహా వారంలో మిగిలిన రోజుల్లో ఒక్కొక్కరికి 750 చొప్పున కేటాయిస్తారు. కరోనా కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణం టోకెన్లు నిలిచిపోయాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ ఈ టోకెన్లను జారీ చేస్తున్నారు. తొలుత సీఆర్‌వో కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన అంగప్రదక్షిణం టోకెన్లకు భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు రద్దీ కూడా పెరుగుతుండడంతో జూలై నుంచి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణం చేస్తున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లతో భక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగప్రదక్షిణలు తీసుకుంటారు.