Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!
ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
- By Balu J Published Date - 08:30 AM, Mon - 12 December 22

ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. కంపార్ట్ మెంట్లో వేచి ఉన్న భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం ప్రకారం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.
నిన్నటి రోజున 72,466 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,123 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజు హుండీ ద్వారా శ్రీవారి భక్తులు 4.29 కోట్ల రూపాయలు కానుకలు సమర్పించారు.