3 Killed : మున్నేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు
ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర వద్ద మున్నేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కంచికచెర్ల పోలీసులు
- By Prasad Published Date - 09:13 AM, Tue - 14 November 23

ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర వద్ద మున్నేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కంచికచెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన 10 మంది యువకులు సెలవురోజు కావడంతో వాగు వద్దకు వెళ్లారు. వారిలో కొందరు వాగులోకి ప్రవేశించగా, మరికొందరు ఒడ్డు నుండి చూస్తున్నారు. అయితే వారిలో ముగ్గురు యువకులు లోతుగా నీటిలోకి దిగడంతో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు వాగులోకి దిగారు. వారిలో ఒకరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను, మూర్ఛలో ఉన్న వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వాగులో నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు యడవల్లి గణేష్ (23), గెయిల్ సంతోష్ కుమార్ (21), దానెల్లి దినేష్ (22)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Chaddi Gang : ఏపీలో చడ్డీ గ్యాంగ్ హాల్చల్.. అప్రమత్తమైన పోలీసులు
Related News

AP : సిహెచ్ ఓలు వెంటనే ఆందోళన విరమించాలని కోరిన వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
సహేతుకం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్యాధికారులు (CHOs/MLHPs) వెంటనే తమ ఆందోళనను